E-Paper
Advertisement

Tamilsai: అమిత్‌ షా తిట్టలేదు.. ఊహాగానాలను కొట్టివేసిన తమిళిసై

Tamilsai: అమిత్‌ షా తిట్టలేదు.. ఊహాగానాలను కొట్టివేసిన తమిళిసై
Advertisement

Tamilsai: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై మధ్య స్టేజిపై సంభాషణ జరిగింది. ఈ సంభాషణ సీరియస్ గా సాగినట్లు కనిపించింది. దీంతో వీరిద్దరికి సంబంధించిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ విషయం దేశమంతటా చర్చకు దారి తీసింది. ఇందులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు స్టేజిపై ఉన్న తమిళి సై అందరికీ అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో అమిత్ షా వెనక్కి పిలిచి సీరియస్ గా మాట్లాడారు. ఆమె ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుండగా.. వార్నింగ్ ఇచ్చారంటూ.. రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా, ఈ ఊహాగానాలను తమిళి సై కొట్టిపడేశారు.

Advertisement

తప్పుగా అర్థం చేసుకున్నారు..

అమిత్ షాతో చర్చకు సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న వీడియోను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తమిళి సై చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అమిత్ షాను తొలిసారి కలిశాను. పోలింగ్ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో ఎదుర్కొన్న సవాళ్లను తెలుసుకునేందుకు అమిత్ షా పిలిచారు.
నేను ఆయనకు వివరణ ఇస్తుండగా.. సమయ భావాన్ని దృష్టితో మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. ఈ మాటలు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది.’ అని పేర్కొన్నారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×