E-Paper
Advertisement

రాయపురం ఎమ్మెల్యే విజయ్ దాము అఫిడవిట్‌లో షాకింగ్ నిజాలు.. ఆటో డ్రైవర్ అని గెలిచారు.. కానీ సీన్ కట్ చేస్తే!

రాయపురం ఎమ్మెల్యే విజయ్ దాము అఫిడవిట్‌లో షాకింగ్ నిజాలు.. ఆటో డ్రైవర్ అని గెలిచారు.. కానీ సీన్ కట్ చేస్తే!
Advertisement

Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల ఒక పేరు మారుమోగిపోతోంది.. ఆయనే విజయ్ దాము. దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ తరపున రాయపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఒక సామాన్యుడు, అందులోనూ ఆటో డ్రైవర్ స్థాయి నుండి అసెంబ్లీకి ఎన్నికవ్వడం ప్రజాస్వామ్యానికే అందం తెచ్చిందని సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా దామును అందరూ నెత్తిన పెట్టుకున్నారు.

ప్రశంసల వెల్లువ.. వైరల్ అయిన ‘సిన్డ్రెల్లా’ స్టోరీ
ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ దాము ఒక సాధారణ ఆటో డ్రైవర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు. ఒక సామాన్య శ్రామికుడు రాజకీయాల్లోకి వచ్చి గెలవడాన్ని ప్రజలు ఆశీర్వదించారు. విజయ్ అభిమానులతో పాటు సామాన్య జనం కూడా దాము గెలుపును తమ గెలుపుగా భావించారు. ఒక సాధారణ ఆటో నడుపుకునే వ్యక్తి చట్టసభల్లోకి వెళ్లడం అంటే అది నిజంగా అద్భుతమేనని దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. అయితే, గెలిచిన తర్వాత బయటకొచ్చిన కొన్ని విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Advertisement

అఫిడవిట్‌లో అసలు నిజాలు.. ఆటో డ్రైవరా? బిజినెస్‌మెన్నా?
విజయ్ దాము ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించాక అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అందరూ భావిస్తున్నట్లుగా ఆయన పేరు మీద అసలు ఒక ఆటో కూడా లేకపోవడం గమనార్హం. ఆయన దాఖలు చేసిన వివరాల ప్రకారం.. 2025లో సుమారు రూ. 20 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారును కొనుగోలు చేశారు. వీటితో పాటు రెండు హోండా బైకులు కూడా ఆయన ఆస్తుల జాబితాలో ఉన్నాయి. తాను ఒక ‘ఆటో కన్సల్టెన్సీ’ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఆస్తుల చిట్టా..
కేవలం వాహనాలే కాదు, ఆర్థికంగా కూడా దాము గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 25 లక్షల విలువైన చరాస్తులు ఆయన పేరిట ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. ఒక సాధారణ డ్రైవర్ అంటే ఉండాల్సిన ఆర్థిక స్థితికి, విజయ్ దాము అఫిడవిట్‌లో ఉన్న వివరాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ‘ఆటో డ్రైవర్’ అనే బ్రాండ్ కేవలం ఎన్నికల కోసం వాడుకున్న వ్యూహమా? లేక కన్సల్టెన్సీ నడుపుతూ డ్రైవర్‌గా గుర్తింపు పొందారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వ్యూహం ఫలించింది.. విజయం దక్కింది!
కారణం ఏదైనా, ‘రాయపురం’ కోటపై TVK జెండాను ఎగురవేయడంలో విజయ్ దాము సఫలమయ్యారు. ప్రజలకు చేరువ కావడానికి ఆయన ఎంచుకున్న ‘సామాన్యుడి’ ముద్ర ఓటర్లను అమితంగా ఆకర్షించింది. అఫిడవిట్ లోని ఆస్తుల వివరాలు ఎలా ఉన్నా, ఒక కొత్త పార్టీ నుండి పోటీ చేసి గెలవడం అంటే అది చిన్న విషయం కాదు. ప్రస్తుతానికి ఈ ‘ఆటో డ్రైవర్’ ట్విస్ట్ తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Also Read: విధి ఆడిన వింత నాటకం.. పెళ్లికి వెళ్తూ వరుడు మృతి.. వధువు మెడలో తాళి కట్టిన తమ్ముడు!

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×