E-Paper
Advertisement

Action Thriller OTT : మల్టీవర్స్ ప్రపంచంలో విలన్ తుక్కురేగ్గొట్టే కామన్ వుమెన్… ఇది కదా కావాల్సింది

Action Thriller OTT : మల్టీవర్స్ ప్రపంచంలో విలన్ తుక్కురేగ్గొట్టే కామన్ వుమెన్… ఇది కదా కావాల్సింది
Advertisement

Action Thriller OTT : మల్టీవర్స్ కాన్సెప్ట్‌ తో వచ్చిన ఒక మూవీ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఆస్కార్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఒకటి కాదు, రెండు కాదు ఈ మూవీ ఏకంగా ఏడు విభాగాల్లో ఆస్కార్లను గెలవడం విశేషం. ఈ స్టోరీ కూడా సరికొత్తగా ఉంటుంది. ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ థీమ్స్ తో మూవీ ఆసక్తిగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా తల్లి కూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని ఈ చిత్రం అద్భుతంగా చూపించింది. ఈ సినిమాను మీరు కూడా చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడే ఓ లుక్ వేయండి. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో వచ్చిన ఈ అమెరికన్ సై-ఫై యాక్షన్ మూవీ పేరు ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once). ఈ సినిమా డానియల్ క్వాన్, డానియల్ షీనెర్ట్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో మిషెల్ యో, కే హుయ్ క్వాన్, స్టెఫానీ హ్సు, జేమీ లీ కర్టిస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 95వ అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు సహా మొత్తం 7 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం sonylivలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : నిమిషానికో ట్విస్ట్… ఈ సిరీస్ ను చూశాక డాక్టర్లకు దండం పెడతారు… కే-డ్రామా లవర్స్ డోంట్ మిస్

స్టోరీ ఏమిటంటే

అమెరికాలో స్థిరపడిన ఒక చైనీస్ వలస కుటుంబానికి చెందిన ఎవెలిన్ వాంగ్, తన భర్త వేమండ్‌తో కలిసి ఒక లాండ్రీ షాపును నడుపుతూ ఆర్థిక సమస్యల్లో సతమతమవుతూ ఉంటుంది. ఆమె తన కూతురు జాయ్‌తో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, అనూహ్యంగా మల్టీవర్స్ ఉనికి గురించి తెలుసుకుంటుంది. వేరే ప్రపంచం నుండి వచ్చిన తన భర్త వెర్షన్ ద్వారా, మొత్తం విశ్వాన్నే నాశనం చేయాలని చూస్తున్న జోబు తుపాకి అనే శక్తిని ఎదుర్కోవడానికి ఎవెలిన్ మాత్రమే సరైన వ్యక్తి అని ఆమెకు అర్థమవుతుంది.

Advertisement

విశ్వాన్ని రక్షించే క్రమంలో, ఎవెలిన్ మల్టీవర్స్‌లోని ఇతర వెర్షన్ల నుండి మార్షల్ ఆర్ట్స్ తో సహా రకరకాల టెక్నిక్స్ ను తెలుసుకుంటుంది. ఈ పోరాటంలో ఆమె తన కూతురు జాయ్‌ కి దగ్గరవుతూ, విశ్వాన్ని కాపాడుకోవడడానికి ప్రయత్నిస్తుంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా ? కూతురితో సంబంధం మెరుగుపడుతుందా ? ఆమె విశ్వాన్ని కాపాడుతుందా ? ఇంతకీ జోబు తుపాకి అనే శక్తి ఏ విశ్వం నుంచి వచ్చింది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×