Friday OTT Releases : ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెలలోని ప్రతి శుక్రవారం రోజు థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. ఈవారం కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రేపు రిలీజ్ అవుతారు సినిమాలలో టాలీవుడ్ కమెడియన్ సత్యా నటించిన జెట్లీ మూవీ, టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్, హీరో తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటుగా ఓ తండ్రి కథ తో పాటుగా.. మరో రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. అయితే నిన్న రిలీజ్ అయిన ధనుష్ కర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకుంది.. మరి ఇవాళ రిలీజ్ కాబోతున్న సినిమాలు ఆ సినిమాకి ఎలాంటి పోటీని ఇస్తాయో చూడాలి.. వీటితో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఆ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
ఈ శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత శుక్రవారం తో పోలిస్తే ఇవాళ దాదాపు 20 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. ఇది మాత్రమే కాదు శర్వానంద్ నటించిన బైకర్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటుగా రీసెంట్గా రిలీజ్ అయిన సంగీత్ శోభన్ మూవీ రాకాస కూడా ఇవాళ నుంచే స్ట్రీమింగ్ అవుతుంది.. ఇది మాత్రమే కాదు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.. ఇక ఆలస్యం లేకుండా.. ఆ సినిమాలు ఏవి? ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి రాబోతున్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందాం…
సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 01
యూ ఆర్ డేటింగ్ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01
సోదర(తెలుగు మూవీ)- మే 01
బైకర్ (తెలుగు మూవీ) – మే 01
రాకాస (తెలుగు సినిమా) – మే 01
గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మే 01
స్వాప్‌డ్(యానిమేషన్ మూవీ)- మే 01
యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01
బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01
పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03
క్లీకా (హాలీవుడ్)- మే 03
మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01
బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01
మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01
సన్ ఇన్ లా(హాలీవుడ్ మూవీ)- మే 01
ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 01
ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 01
డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) – మే 01
ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) – మే 01
ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01
హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01
మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01
గతంలో వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన ద కేరళ స్టోరీ సినిమా కోసం ఓటిటి లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితో పాటుగా మరో రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే ఈ సినిమాలో తమ స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి. మరి సడన్ గా మరికొన్ని సినిమాలు యాడ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాలు ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటే చూడాలి…