BigTV English

OTT Movie : గతం తాలూకా జ్ఞాపకాలు.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో స్టోరీ.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 

OTT Movie : గతం తాలూకా జ్ఞాపకాలు.. మైండ్ బ్లాక్ ట్విస్టులతో స్టోరీ.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. 

OTT Movie : ఓటీటీ మూవీస్ ఈ మధ్య సస్పెన్స్ స్టోరీలతో నిండిపోయింది.. రోజుకో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. థ్రిల్లర్ సస్పెన్స్ మూవీలతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి స్టోరీ సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అవుతుండటంతో ఆడియన్స్ కు ఇలాంటి సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు. తాజాగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో అదిరిపోయే సస్పెన్స్ లు ఉన్న ఒక థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మలయాళ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ మూవీ పేరేంటో? అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


మలయాళం ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ అగాథోకాకోలాజికల్ థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.ఆ సినిమానే మనోరమా మ్యాక్స్.. ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్ని నెలలకు ఓటీటీలోకి రావడం విశేషం.. ఈనెల 31 న ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. లీయోనా లిషోయ్ హీరోయిన్‌గా నటించింది. ప్రశాంత్ మురళి, మఖ్బూల్ సల్మాన్‌, వాసుదేవన్ ఉన్ని కీలక పాత్రల్లో కనిపించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకు సీడి వెంకటేష్ దర్శకత్వం వహించారు.. ఆ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. జూలై 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. ఐఎమ్‌డీబీలో 9.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. ఈరోజుల్లో సమాజంలో మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అన్నది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఊహలకు అందని ట్విస్ట్‌లతో సినిమా సాగడంతో పాటు ఛాలెంజింగ్ రోల్‌లో లీయోనా లిషోయ్ యాక్టింగ్ అగాథోకాకోలాజికల్ మూవీ సక్సెస్ అయ్యేలా చెయ్యడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకొనేలా చేసాయి. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. నిషా అర్కిటెక్ట్‌గా ఉద్యోగం చేస్తుంటుంది. భర్త వినీత్‌తో పాటు కొడుకుతో సంతోషంగా ఆమె జీవితం సాగిపోతుంది. ఓ రోజు ఓ అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన కాల్‌తో నిషా జీవితం మొత్తం తలక్రిందులవుతుంది. నిషా గతం గురించిన ఓ రహస్యాన్ని బయటకు చెబుతానని బెదిరిస్తాడు. ఇక ఈ బ్లాక్‌మెయిలర్‌పై పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది నిషా. అప్పటి నుంచి ఆమెను కొంత మంది వ్యక్తులు వెంబడించడం మొదలుపెడతారు. నిషా కేసును ఎస్ఐ అజిత్ ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో ఏం నిజాలు వెలుగు చూసాయి అనేది సినిమాకు హైలెట్ టాపిక్.. దాంతో అసలు ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారుతుంది. ఆ గతంలో ఏమి జరిగింది. ఎందుకు ఇంతగా భయపడుతుంది అనేది ఈ సినిమా స్టోరీ.. ఇక అక్కడ థియేటర్లలో జనాలను వణికించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


ఇకపోతే మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ మోడల్ గా కేరీర్ ఆరంభించి 30 కి పైగా సినిమాలు చేసింది. అలాగే హనుమాన్ హీరోతేజా సజ్జా హీరోగా నటించిన ఇష్క్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది లియోనా లిషోయ్‌. ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించబోతుంది..

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×