E-Paper
Advertisement

OTT Movie : చెల్లి భర్తను అక్క లాగేసుకోవాలి అనుకుంటే… క్రేజీ క్రైం థ్రిల్లర్

OTT Movie : చెల్లి భర్తను అక్క లాగేసుకోవాలి అనుకుంటే… క్రేజీ క్రైం థ్రిల్లర్
Advertisement

OTT Movie :  క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో ఉండే ట్విస్టులు క్రేజీగా ఉంటాయి. కొన్ని సినిమాలలో అయితే నిమిషానికో మలుపు ఉండటంతో పాటు కథ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సొంత బంధువులే రాబందుల్లా పొడుచుకు తింటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ సొంత అక్క చెల్లెలి భర్తని లాగేసుకోవాలి అనుకునే స్టోరీ. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటిటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్..

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ మహేష్ బాబు “1 నేనొక్కడినే” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రీసెంట్ గా “క్రూ” మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు నటించి నిర్మించిన మూవీనే “దో పట్టి” (Do Patti). ఈ మూవీలో కృతి సనన్ తో పాటు కాజోల్ అగర్వాల్ కూడా లీడ్ రోల్ పోషించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమాలో శైలి, సౌమ్య అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. శైలి హార్ష్ గా, ఆధునికంగా ఉంటే… సౌమ్య కూల్ గా పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లాగా ఉంటుంది. అయితే చిన్నప్పుడే చెల్లెలితో వచ్చిన విభేదాల వల్ల శైలిని తీసుకెళ్లి హాస్టల్ లో వేస్తారు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోవడంతో సౌమ్య తన బాబాయ్, పిన్ని దగ్గర పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడే పారాగ్లైడింగ్ సెంటర్ ఓనర్ తో సౌమ్యకి పరిచయం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఎత్తులు అంటే భయపడే సౌమ్య ఇంట్రవర్ట్ లాగా ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలోనే శైలి ఎంట్రీ ఇచ్చి చెల్లెలి లవర్ ని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటారు కూడా. కానీ ఒకానొక టైంలో శైలి ప్రవర్తన వల్ల 500 కోట్ల ప్రాజెక్ట్ హీరో చేజారుతుంది. శైలి వల్ల మొత్తం నాశనం అవుతుంది అని భావించిన హీరో వెంటనే శైలిని పక్కన పెట్టి సౌమ్యను పెళ్లి చేసుకుంటాడు.

అయితే ఆ తర్వాత కూడా శైలి వదలకుండా తన చెల్లెలి కాపురంలో వేలు పెడుతూ ఉంటుంది. చెల్లెలిపై ఉన్న కోపం, కసి, డ్రామాలు ఆడుతూ అటెన్షన్ కోరుతుందనే ఆలోచనతో అలా చేస్తుంది శైలి. అయితే ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల హీరో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ ని దారుణంగా కొడుతూ ఉంటాడు. అదే ఏరియాలో పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న కాజోల్ హీరోయిన్ ని తన భర్తకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. కానీ సౌమ్య మాత్రం అస్సలు ఒప్పుకోదు. మరోవైపు శైలి ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోదు. ఒకానొక టైంలో పిల్లలు కావాలని అడిగిన సౌమ్యని హీరో చావగొడతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హోలీ సంబరాల్లో పాల్గొని అనంతరం పారా గ్లైడింగ్ కి వెళ్తారు. అక్కడ ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ పిల్లలు కావాలని అడిగిన తన భర్త తనను చంపాలనుకున్నాడని కంప్లైంట్ చేస్తుంది. అసలు ఇన్ని రోజులు తన భర్తపై కంప్లైంట్ ఇవ్వని సౌమ్య ఇప్పుడు ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళింది? నిజంగానే అతను తన భార్యను చంపాలి అనుకున్నాడా? కేసులో వీళ్లిద్దరి వివాదంపై ఎలాంటి తీర్పు వచ్చింది? ఇందులో కాజల్ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయండి.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×