This week OTT Releases : సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూ ఉంటే, ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతూ ఉంటాయి.. నిజం చెప్పాలంటే థియేటర్లలో వచ్చే సినిమాలు కన్నా ఇక్కడ వచ్చే సినిమాలకే డిమాండ్ రోజురోజుకి ఎక్కువవుతుంది. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఓటీటీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఈవారం థియేటర్లోకి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే రిలీజ్ కాలేదు కానీ, ఇక్కడ రిలీజ్ అయ్యే సినిమాలు మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ వీక్ దాదాపు 19 సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. మరి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం..
ఈ వీక్ ఓటీటీలోకి రాబోతున్న మూవీస్ విషయానికొస్తే.. గతవారంతో పోలిస్తే ఈ వారం దాదాపు 19 సినిమాలకు పైగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ధనుష్ నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా కర థియేటర్లలో మంచి స్పందన అందుకున్న మూవీ రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ కమెడియన్ సత్యా నటించిన జెట్లీ మూవీ కూడా ఈవారం ఓటీటీ లోకి రాబోతుంది.. వీటితో పాటుగా హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు అదేవిధంగా తెలుగులో కూడా మరికొన్ని సినిమాలు సడన్గా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకొనే అవకాశాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు. ఈవారం ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్న సినిమాలు ఏవో? ఎక్కడ చూడచ్చునో ఒక్కసారి వివరంగా..
స్పైడర్ నోయిర్ ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్- మే 27)
లీడర్ ( తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 28
పేసెస్ ( తెలుగు డబ్బింగ్ మూవీ ) – మే 29
రూమ్ మేట్స్ ( కన్నడ డబ్బింగ్ మూవీ) – మే 27
ప్రొఫెలర్ వన్ నైట్ కోచ్ ( ఇంగ్లీష్ సినిమా) -మే 29
స్టార్ సిటీ ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) – మే 29
ద రేస్ ( రోమియేన్ మూవీ ) – మే 29
జెట్లి ( తెలుగు సినిమా ) – మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ( తెలుగు డబ్బింగ్ మూవీ ) – మే 27
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ ( తెలుగు డబ్బింగ్ సిరీస్) – మే 29
అంటోల్డ్ యూకే: విన్నీ జోన్స్ ( ఇంగ్లీష్ డాక్యూమెంటరీ )- మే 26
ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ సీజన్స్ 2( ఇంగ్లీష్ సిరీస్ ) మే 27
మై టూ సెంట్స్ ( ఇటాలియాన్ వెబ్ సిరీస్ ) – మే 27
కర ( తెలుగు డబ్బింగ్ మూవీ ) – మే 28
ఏమి మార్టీనజ్ ( ఇంగ్లీష్ మూవీ ) – మే 28
మర్డర్ మైండ్ ఫుల్లీ ( జర్మనీ వెబ్ సిరీస్ ) – మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 ( ఇంగ్లీష్ సిరీస్ ) – మే 28
కలబాసన్ కాన్ఫిడెన్టల్( ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ) – మే 29
వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ఈవారం మూవీ లవర్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకులకు రాబోతున్నాయి. అయితే సత్య నటించిన జెట్లీ., కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కర మూవీ పై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈవారం వెబ్ సిరీస్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలకు పండగే అని చెప్పాలి.. ఇక జూన్ నెలలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ప్రేక్షకులు ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో చూడాలి…