meenakshi Choudary (1)
Meenakshi Chaudhary Photos: మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెబ్ సిరీస్‌లతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం హీరోయిన్గా వెండతెరపై అలరిస్తోంది. మొన్నటి వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తతం స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేస్తుంది.
meenakshi Choudary (2)
అప్ స్టార్స్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ, ఇందులో మీనాక్షి నటన, లుక్స్‌కి మంచి మార్కులు పడ్డాయి.
meenakshi Choudary (3)
అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. అలా తొలి చిత్రంతోనే ఈ బ్యూటీ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ క్రేజ్‌లో మీనాక్షి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. అలా రవితేజ ఖిలాడీలో చాన్స్ కొట్టేసింది. ఈ మూవీ డిజాస్టర్ అయినా మీనాక్షి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
meenakshi Choudary (4)
ఆ వెంటనే హిట్ 2 మూవీలో ఆఫర్ అందుకుంది. అడవి శేష్ సరసన హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. మహేష్ బాబు గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ నటించిన ఈ భామ ఆ తర్వాత లక్కీ భాస్కర్ మూవీలో తల్లి పాత్ర పోషించింది.
meenakshi Choudary (5)
ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీని తర్వాత వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలోనూ హీరోయిన్గా నటించింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి ఇద్దరు హీరోయిన్లు. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది.
meenakshi Choudary (6)
దీంతో ఈ భామకు తెలుగులో మంచి డిమాండ్ పెరగడంతో ఆ వెంటనే నాగ చైతన్య సినిమాలో ఛాన్స్‌లో కొట్టేసింది. అక్కినేని హీరో నాగ చైతన్య, విరూపాక్ష ఫేం కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కతోన్న NC24.
meenakshi Choudary (7)
మైథలాజికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోన్న ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తోంది. దీనితో పాటు ఆమె అనగనగా ఒకరాజు మూవీ కూడా చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీగా మీనాక్షి.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
meenakshi Choudary (8)
తరచూ తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తోంది. ప్రస్తుతం జపాన్ వెకేషన్లో ఉన్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన టూర్ విశేషాలను షేర్ చేసుకుంటోంది. తాజాగా జపాన్ బీచ్‌లో సందడి చేసింది. బ్లూ లైన్ షర్ట్, వైట్ డెనిమిమ్ జీన్స్ షాట్లో మీనాక్షి బిచ్ ఒడ్డున అల్లరి చేసింది. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.