Police Questioned Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాలపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. పెట్టుబడి పేరుతో తన వద్ద రూ. 60 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ దీపక్ కొఠారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజులుగా ఈ వ్యవహరంలో శిల్పా శెట్టి దంపతులు న్యాయపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో వారికి పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. విచారణ పూర్తయ్యేవరకు వారిని దేశం విడిచి ఎక్కడికి వెళ్లోందని ఆంక్షలు విధించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు శిల్పా శెట్టిని ప్రశ్నించారు. మంగళవారం (అక్టోబర్ 7) ముంబై పోలీసులు శిల్పాశెట్టి ఇంటికి వెళ్లారు.
రూ. 60 కోట్ల చీటింగ్ కేసులో వారిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దాదాపు 4 గంటల పాటు పోలీసులు వారిని విచారించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి బ్యాంక్ స్టేట్మెంట్స్, లావాదేవిలు, ఇతర ఖర్చులు వివరాలపై పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే శిల్పా శెట్టి కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె భర్త రాజ్కుంద్రాను కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తమకు సంబంధించిన కంపెనీలో రూ. 60 కోట్లు పెట్టుబడులు పెట్టించినట్టు ఒప్పుకున్నాడు. అయితే ఆ నిధులను నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్లిచారా లేదా ఇతర వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు విచారించారు.
ఇప్పుడు తాజాగా శిల్పా శెట్టిని కూడా వివరించారు. ప్రస్తుతం ఈ రూ. 60కోట్లు ఒప్పందం ప్రకారం కంపెనీలో పెట్టారా? మరేవిధంగానైనా మళ్లీంచారా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వీరు పోలీసుల నిబంధనలు ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. కేసు విచారణ సయమంలో వీరు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదని ఆదేశిస్తూ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ శిల్పాశెట్టి దంపతులు ఇటీవల థాయ్లాండ్ పర్యటకు వెళ్లిన పోలీసులు ఆదేశాలను దిక్కరించారు. దీనిపై కూడా తాజాగా పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. కాగా బాలీవుడ్లో ఎన్నో చిత్రాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది శిల్పాశెట్టి.
Also Read: Bigg Boss: బిగ్ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!
90’sలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమిర్ ఖాన్ వంటి ఎంతోమంది స్టార్స్ సరసన నటించింది. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజ్కుంద్రా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్బై చెప్పింది. కొంతకాలం పాటు వైవాహిక జీవితంతో బిజీ అయిపోయిన శిల్పా ఇటీవల పలు టీవీ షోలతో రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఓ సీజన్లో బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఇటూ టీవీ షోలు అటూ భర్త వ్యాపారాలు చూసుకుంటుంది. మరోవైపు పిల్లల ఆలనపాలన కూడా చూసుకుంటూ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె చీటింగ్ ఆరోపణలతో తరచూ వివాదాల్లో నిలుస్తోంది. గతంలో తన తల్లి,ఆమెపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. తాజాగా భర్త రాజ్కుంద్రా బిజినెస్ వ్యాపారంలో శిల్పాశెట్టి చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొవడం చర్చనీయాంశం అయ్యింది.