IRCTC Bharat Gaurav: ఐఆర్సీటీసీ తెలుగు రాష్ట్రాల మీదుగా “భవ్య గుజరాత్” భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. అక్టోబర్ 26, 2025న మధ్యాహ్నం 3 గంటలకు ఈ టూరిస్ట్ రైలు రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం అవుతుందని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఈ రైలు ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ ఆలయం, బెట్ ద్వారక, సోమనాథ్ ఆలయం, సబర్మతి ఆశ్రమం, మోధేరా సూర్య దేవాలయం, రాణీ కి వావ్, స్టాట్యూ ఆఫ్ యూనిటీను కవర్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ.. తెలంగాణలోని ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ వంటి ముఖ్యమైన స్టేషన్లలో బోర్డింగ్ / డీ-బోర్డింగ్ సౌకర్యం ఉంటుంది. మొత్తం ట్రిప్ 09 రాత్రులు/10 రోజుల వ్యవధిలో ఈ పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తారు. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు, రోడ్డు రవాణా రెండూ సహా), వసతి, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) ఉన్నాయి.
రైలులో పర్యాటకుల భద్రత కోసం అన్ని కోచ్‌లలో CCTV, అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమా, ప్రయాణ సమయంలో ప్రతి కోచ్‌లో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ద్వారక : ద్వారకాధీష్ దేవాలయం, నాగేశ్వరాలయం, బెట్ ద్వారక
సోమనాథ్ – సోమనాథ్ ఆలయం
అహ్మదాబాద్ – సబర్మతి ఆశ్రమం, మొధెరా సూర్య దేవాలయం (మొధేరా), రాణి కి వావ్ (పటాన్)
ఏక్తా నగర్ – స్టాట్యూ ఆఫ్ యూనిటీ
పర్యటన తేదీలు – 26.10.2025 నుండి 04.11.2025 వరకు -(09 రాత్రులు / 10 రోజులు)
రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, హజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణా
సర్వీస్ : ఎకానమీ -స్టాండర్డ్ -కంఫర్ట్
రైలు జర్నీ క్లాస్ : స్లీపర్ -3AC -2AC
డబుల్/ట్రిపుల్ షేర్ : రూ. 18,400 -రూ. 30,200 -రూ. 39,900
పిల్లవాడు (5-11 సంవత్సరాలు) -రూ. 17,300 -రూ. 28,900-రూ. 38,300
Also Read: Longest Railway Platform: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?
బుకింగ్ కోసం పర్యాటకులు 9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారి శ్రీధర్ తెలిపారు. ఆన్‌లైన్ బుకింగ్‌ల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.