Hero Dharma Mahesh Wife : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి పోతే మరొకటి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. మొన్నటి వరకు హీరో రాజ్ తరుణ్, లావణ్య మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో చూసే ఉంటారు.. ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ మహేష్ గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొన్నటివరకు భార్య, భర్తల మధ్య విభేదాలు అని వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు భార్య హీరో పై ఆరోపణలు చేసింది. నమ్మలేని నిజాలను బయట పెట్టింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది..
బిగ్ బాస్ ఆర్టిస్ట్ లతో అక్రమ సంబంధాలు..
హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఇదివరకే అతనిపై వరకట్నం వేధింపుల కేసు నడుస్తుంది. పోలీసులు విచారణ ను వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది గౌతమి.. ఈ సందర్భంగా ఆమె ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టింది. హీరో చీకటి బాగోతాలను బయటపెట్టింది ఆయన భార్య. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా భర్తకు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ ఆర్టిస్టులు తరచూ అతని ఫ్లాట్ కు వస్తుంటారు. వారందరి గురించి నేను అడిగితే నన్ను టార్చర్ చేస్తున్నాడు.. అంతే కాదు నాకు ఎఫైర్లు ఉన్నాయి అంటూ అంటున్నాడు, నా కొడుకు పై కూడా అనుమాన పడుతున్నాడు అని గౌతమి తన ఆవేదనను వ్యక్తం చేసింది..
Also Read: కుక్క కాటు.. ప్రేమ కాటు అనుకుంటారు..సుప్రీం కోర్టు తీర్పు పై వర్మ సంచలన ట్వీట్..
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే చంపాలని ప్లాన్..
తన ఎఫైర్ల గురించి చెప్పడం మాత్రమే కాదు.. తనను ఎంతగా టార్చర్ చేశారో ఆమె వివరించింది. ఒకప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం లో నరకాన్ని అనుభవించానని గౌతమి అంటున్నారు. నన్ను చంపాలని చూశారు. వారి నుంచి తప్పించుకుని తిరిగాను. ప్రతిరోజూ నాకు ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారు. కిరాయి రౌడీలతో నన్ను చంపించాలని చూస్తున్నారు. ధర్మ గురించి నేను అడిగినందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు. వాళ్ల నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నన్ను కాపాడండి. నా బిడ్డను కూడా చంపేయాలని చూస్తున్నారు.. నేనొక యూట్యూబ్ ఇన్ఫ్లు యెన్సర్.. నా కంటెంట్ ద్వారా వస్తున్న డబ్బులతో నేను నా బిడ్డను పోషించుకుంటూ బ్రతుకుతున్నాను అని గౌతమి అంటున్నారు.. గౌతమి, ధర్మకు 2019లో లవ్ మ్యారేజ్ జరిగింది. వీరికి రీసెంట్ గానే ఓ కొడుకు పుట్టాడు.. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు గౌతమి ఇచ్చిన ఇంటర్వ్యూ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై హీరో ధర్మ మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.. చూస్తుంటే ఇప్పటిలో ఇది సర్దుమనిగేలా లేదు..