Jobs in Telangana: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. రాష్ట్ర వైద్య శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ఉద్యోగ ఎంపిక విధానం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ వైద్య శాఖలో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22న దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1623
వైద్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
మల్టీ జోన్-1: 858 పోస్టులు
మల్టీ జోన్-2: 765 పోస్టులు
విద్యార్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ పాసై ఉండాలి. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.500 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.58,850 నుంచి రూ.1,37,050 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 1623
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 22
ALSO READ: DSSSB Recruitment: అద్భుతమైన అవకాశం.. ఇంటర్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..