Nellore: నెల్లూరులో ఇద్దరు యువకుల దారుణ హత్యకు గురయ్యారు. ఇద్దరిని హత్య చేసిన దుండగులు మృతదేహాలను పెన్నా నదిలో పడేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి నెల్లూరు హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరి మృదేహాలపై గాయాలు గుర్తించిన పోలీసులు.. హత్య చేసింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా డబుల్ మర్డర్ కేసు తీవ్ర కలకలం రేపుతుంది. అక్కడి కొందరు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అందులో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గొడవ తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న వారది కాల్వ వద్దకు యువకులను లాక్కెళ్లారు. అక్కడ కర్రలతో కొట్టి ఏ ఆధారాలు లేకుండా వారిని పెన్నా నదిలో పడేసారు. అయితే ఆ మృతులను గిరిజనులుగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో ఒకరిని స్థానికుడిగా గుర్తించారు. .
అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు
స్థానికుల సమాచారంతో 50 అడుగుల దూరంలో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. క్రేన్ లతో మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. టవర్ డంపు ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకుంటామన్నారు డీఎస్పీ సింధు.
Also Read: విజయనగరంలో ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..