Mithra Mandali Trailer: ఇటీవల కాలంలో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎన్నో సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.. అయితే త్వరలోనే మరో కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “మిత్రమండలి”(Mithra Mandali)చిత్రం. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా మిత్రమండలి సినిమా నుంచి ట్రైలర్ (Trailer) వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది.
ప్రియదర్శి(Priyadarshi) హీరోగా నిహారిక ఎన్ ఎమ్ (Niharika NM)ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ సినిమా నటీనటులు విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా వీరితో వెన్నెల కిషోర్ చేసే కామెడీ సన్నివేశాలు పెద్ద ఎత్తున అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే ట్రెండ్ కు అనుగుణంగా సరదా డైలాగులతో ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ ట్రైలర్ వీడియోలో సత్య, నిహారిక, వెన్నెల కిషోర్ వారి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక బ్రహ్మానందం సన్నివేశం కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ ఇస్తుందని స్పష్టం అవుతుంది. ఓకే అమ్మాయి కోసం స్నేహితులందరూ గొడవ పడడంతో ఇలాంటి మహిళా మండలి కోసమే మిత్రమండలి కనుమరుగవుతోంది అంటూ చెప్పే డైలాగు ఆకట్టుకుంది.
ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్ లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ వీడియో చూసి నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా మిత్రమండలి సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేశాయి.
సినిమా విషయానికి వస్తే..బీవీ వర్క్స్, సప్త అశ్వ క్రియేటివ్స్ వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించటం విశేషం. బన్నీ వాసు ఇప్పటివరకు గీత ఆర్ట్స్2 బ్యానర్ లో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. మొదటిసారి ఈయన తన సొంత బ్యానర్ బీవీ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కిన మిత్రమండలి సినిమా ద్వారా రాబోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం బన్నీ వాసు తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.