Nagachaitanya -Sobhita: సినీ నటుడు నాగచైతన్య(Nagachaitanya) గత ఏడాది డిసెంబర్లో తన రెండవ వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. నాగచైతన్య దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రేమలో కొనసాగుతూ చివరికి గత ఏడాది పెద్దల సమక్షంలో చాలా సింపుల్ గా వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇలా శోభిత (Sobhita) తో వివాహం తర్వాత నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూనే మరోవైపు వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇకపోతే తాజాగా నాగచైతన్య జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారి తన భార్య శోభిత గురించి తెలిపారు.
సమంత(Samantha) నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నాగచైతన్యకు శోభిత ఎలా పరిచయమయ్యారు? ఏంటి అనే విషయాలను తెలియచేశారు. శోభిత నాగచైతన్యకు ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు అసలు శోభిత అలా పరిచయమవుతుందని తాను అసలు అనుకోలేదని వెల్లడించారు. ఒకరోజు నేను నా క్లౌడ్ కిచెన్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు ఆ పోస్టుపై శోభిత కామెంట్ చేయడంతో మా ఇద్దరి మధ్య పరిచయం మొదలైందని తెలిపారు.ఈ పరిచయం అనంతరం ఇద్దరు కలుసుకొని మాట్లాడమని శోభితతో తొలి పరిచయం గురించి నాగచైతన్య ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా నా జీవిత భాగస్వామి నాకు దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ చైతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇలా శోభితతో తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ శోభితతో పెళ్లి తర్వాత నాగచైతన్య చాలా హ్యాపీగా గడుపుతున్నారు. అయితే ఇదివరకు ఈయన సమంతను ప్రేమించి దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
విరూపాక్ష దర్శకుడితో నాగచైతన్య..
ఇలా వివాహం జరిగిన మూడు సంవత్సరాలకు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అసలు వీరి విడాకులకు శోభిత కూడా కారణం అంటూ ఒకానొక సమయంలో వార్తలు హల్చల్ చేశాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ వారి వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా కొనసాగుతూ ఉన్నారు. ఇక నాగచైతన్య కెరియర్ విషయానికి వస్తే తండేల్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం విరూపాక్ష సినిమా దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.