BigTV English

Pakistan Train Blast: జాఫర్ ఎక్స్ ప్రెస్ టార్గెట్ గా మరోసారి బాంబు దాడి, ముక్కలైన 6 బోగీలు!

Pakistan Train Blast: జాఫర్ ఎక్స్ ప్రెస్ టార్గెట్ గా మరోసారి బాంబు దాడి, ముక్కలైన 6 బోగీలు!

Pakistan Train Blast News:

పాకిస్తాన్ రైళ్లను టార్గెట్ చేసి వరుస దాడులకు పాల్పడుతున్న బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు మరోసారి బాంబు దాడికి పాల్పడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌ లో జాఫర్ ఎక్స్‌ ప్రెస్‌ టార్గెట్ గా బాంబు పేల్చారు. ఈ ఘటనలో రైల్లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని సింధ్-బలూచిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సుల్తాన్‌ కోట్ సమీపంలో క్వెట్టాకు వెళ్లే జాఫర్ ఎక్స్‌ ప్రెస్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ  ఏడాది మార్చి నుంచి ఈ రైలును లక్ష్యంగా చేసుకున్నపలు దాడులు జరిగాయి. తాజాగా ట్రాక్‌ మీద అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ ప్లోజివ్ డివైస్ (IED) తో ఈ పేలుడు సంభవించింది. క్వెట్టాకు వెళ్లే ప్యాసింజర్ రైలు కనీసం ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.


దాడికి బాధ్యత వహించిన బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్

జాఫర్ ఎక్స్ ప్రెస్ టార్గెట్ గా బాంబు దాడికి దిగింది తామేనని బలూచ్ తిరుగుబాటుదారుల బృందం, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ వెల్లడించింది. పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నందున దీనిని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.  “పాకిస్తాన్ సైన్యం రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. పేలుడు కారణంగా అనేక మంది సైనికులు మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దాడికి BRG బాధ్యత వహిస్తుంది. బలూచిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చే వరకు ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతాయి” అని బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది

జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బాంబు దాడి జరిగిన నేపథ్యంలో భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగతోంది. ఈ ఘగటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేలుడు స్థలం నుంచి వచ్చిన దృశ్యాలు ఈ సంఘటనలో అనేక మంది గాయపడినట్లు చూపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు, ఎటువంటి ప్రాణ నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.


జాఫర్ ఎక్స్ ప్రెస్ మీద వరుస దాడులు

క్వెట్టా- పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్‌ ప్రెస్‌ ను ఇటీవలి కాలంలో బలూచ్ తిరుగుబాటుదారులు పదే పదే లక్ష్యంగా చేసుకున్నారు. మార్చిలో ఈ రైలు హైజాక్ చేశారు. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ లో రైలుపై దాడికి పాల్పడిన 33 మంది బలూచ్ తిరుగుబాబుదారులను పాక్ భద్రతా దళాలు హతమార్చాయి. సెప్టెంబర్ 24న  బలూచిస్తాన్‌ మస్తుంగ్‌ లోని స్పిజెండ్ ప్రాంతంలో అదే రైలుపై జరిగిన బాంబు దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం 12 మంది గాయపడ్డారు.  ఆగస్టు 10న మస్తుంగ్ జిల్లాలో పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ ప్రెస్ లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. తాజాగా మరోసారి దాడికి దిగారు.

Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?

Related News

Viral Video: టికెట్ లేదు, పైగా దబాయింపు.. నెట్టింట టీచర్ వీడియో వైరల్!

IRCTC Tourist Package: గుజరాత్ లోని ప్రముఖ ఆలయాలు, టూరిస్టు ప్రదేశాలు చూసొద్దామా?.. 10 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే!

Longest Railway Platform: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్, మన దేశంలోనే ఉంది తెలుసా?

Vande Bharat Routes: దేశంలో టాప్ 10 లాంగెస్ట్ వందేభారత్ రూట్లు ఇవే, ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందంటే?

Festival Special Trains: దీపావళి కోసం స్పెషల్ వందేభారత రైళ్లు, ఏ రూట్లో నడుస్తాయంటే?

Weekly Trains: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

Bharat Gaurav Tourist train: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు.. ఏపీ-తెలంగాణ మీదుగా, ఆపై రాయితీ కూడా

Big Stories

×