BigTV English

Aditi Rao Hydari: కొత్త పెళ్లికూతురు కొత్త లుక్.. ఏమన్నా ఉందా.. నెక్స్ట్ లెవెల్ అంతే

Aditi Rao Hydari: అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ అదితి.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నదాని అందానికి తెలుగు కుర్రాళ్ళు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ సినిమా తరువాత చెలియా సినిమాతో మరింతగా ప్రేక్షకులకు దగ్గరయింది.

ఇక మహా సముద్రం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. అభిమానులు మాత్రం అమ్మడి నటనను మెచ్చుకున్నారు కానీ, విజయాన్ని అందించలేకపోయారు. అయితేనేం.. ఈ సినిమా వలన అదితికి సిద్దార్థ్ పరిచయమయ్యాడు.

మహా సముద్రం సినిమాలో సిద్దార్థ్ తో అదితి  పరిచయం.. ప్రణయంగా మారి పరిణయంగా ముగిసింది. గతనెలలోనే సిద్దార్థ్, అదితి పెళ్లితో ఒక్కటైన విషయం తెల్సిందే.

పెళ్లి తరువాత కూడా అదితి తన అందంతో కుర్రకారును మైమరిపిస్తూనే  ఉంది. తెలుగులో అమ్మడి సినిమాలు తక్కువ కానీ, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారింది.

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా ఈ ఏడాది రిలీజ్ అయిన హీరామాండీలో అదితి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా గజగామిని నడకతో ఆమె సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఆ నటనకు గాను ఆమె బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయిస్ కేటగిరిలో ఆమె అవార్డును అందుకుంది.

తాజాగా ఆ అవార్డును అందుకున్న అదితి.. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్.. దానిమీదకు ఇంకా అందాన్ని పెంచే ముత్యాలతో కూడిన చోకర్ ను ధరించింది.  ఇక  జుట్టును  వదిలేయకుండా హెయిర్ బ్యాండ్స్ తో అందంగా టై చేసింది.

ప్రస్తుతం అదితి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొత్త పెళ్లి కూతురు కొత్త లుక్ భలే ఉందే అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Kavya Thapar: జారుతున్న డ్రెస్ లో అందాలు ప్రదర్శించిన కావ్య.. కుర్రాళ్ళు తట్టుకుంటారా?

Sivani Nagaram: గ్రీన్ శారీలో శివాని ఎంత క్యూట్ గా ఉందో… కుర్రాళ్ళు ఏమైపోతారో..

Rashi Singh :  తడి అందాలతో కాకరేపుతోన్న రాశీ సింగ్.. మతిపోగొడుతుంది మావా..!

Meenakshi Chaudhary: జపాన్‌ వెకేషన్‌లో లక్కీ భాస్కర్‌ బ్యూటీ.. బీజ్‌లో మీనాక్షి చౌదరి అల్లరి చూశారా?

Ashu Reddy : బాపురే.. అషు ఎంత కష్టపడుతుందో.. యోగా పిక్స్ వైరల్..

Vishnu Priya : పచ్చకోకలో విష్ణు ప్రియ పరువాల విందు..కుర్రాళ్ళు పరేషాన్..

Big Stories

×