Huawei Mate 70 Air| ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఈ సంవత్సరం విడుదలైన ఐఫోన్ ఎయిర్ కు మెల్లగా మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతోంది. ఇటీవలే మోటోరోలా ఒక స్లిమ్ ఫోన్ లాంచ్ చేయగా.. ఇప్పుడు తాజాగా హవాయ్ కంపెనీ కొత్త స్లిమ్ స్మార్ట్‌ఫోన్ మేట్ 70 ఎయిర్‌ని విడుదల చేసింది. ఇది ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌తో పోటీ పడేలా రూపొందింది. సన్నటి డిజైన్‌తో పాటు పెద్ద బ్యాటరీని బ్యాలెన్స్ చేసే విధంగా దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది ఒక స్లిమ్ ఫోన్ కావడంతో దీని మందం కేవలం 6.6 మిల్లీమీటర్లు మాత్రమే.
బేస్ మోడల్ ధర CNY 4,199 (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.52,200). ఇందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ఉంటుంది. ఇంతకంటే పెద్ద స్టోరేజ్ వేరియంట్ CNY 5,199 (రూ.64,700 వరకు). ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఫెదర్డ్ వైట్, ఆబ్సిడియన్ బ్లాక్ వంటి రెండు వైబ్రెంట్ కలర్స్ లో ఇది వస్తుంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే విడుదలైన ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లో లభిస్తోంది.
స్లిమ్ ఫోన్ అయినప్పటికీ.. ఇందులో 7 అంగుళాల పెద్ద AMOLED స్క్రీన్ ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్ – చాలా షార్ప్ విజువల్స్. టచ్ సాంప్లింగ్ రేట్ 300Hz – టచ్ చాలా రెస్పాన్సివ్. హవాయ్ సొంత హార్మొనీOS 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది – స్మూత్ ఎక్స్‌పీరియన్స్.
వేర్వేరు వేరియంట్లలో వేర్వేరు చిప్‌సెట్లు ఈ ఫోన్ మరో స్పెషాలిటీ. 16GB RAM మోడల్‌లో కిరిన్ 9020A చిప్. మిగతావాటిలో కిరిన్ 9020B ప్రాసెసర్ ఉంటుంది. రెండూ రోజువారీ పనులకు, మల్టీటాస్కింగ్‌కి బాగా పని చేస్తాయి – యాప్స్ స్మూత్‌గా రన్ అవుతాయి.
క్వాడ్ కెమెరా సెటప్ – వెర్సటైల్ గా ఉంటుంది. 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో), 12MP టెలిఫోటో (జూమ్ కోసం), 8MP అల్ట్రా-వైడ్ (వైడ్ షాట్స్), 1.5MP కలర్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 10.7MP తో మంచి సెల్ఫీలతో పాటు డిటైలింగ్స్ తో సూపర్ ఫొటోలు తీయవచ్చు.
స్లిమ్ ఫోన్ అయినప్పటికీ ఇందులో పెద్ద 6500mAh బ్యాటరీ ఉంటుంది. అంటే ఫోన్ రోజంతా సులభంగా రన్ అవుతుంది. 66W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ – త్వరగా ఫుల్ అవుతుంది. వెయిటింగ్ టైమ్ కూడా తక్కువే.
బ్లూటూత్, వై-ఫై, NFC, GPS, బీడౌ నావిగేషన్ – పూర్తి కనెక్టివిటీ. గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి.
మొత్తంగా, సన్నటి డిజైన్, పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్‌తో హవాయ్ మేట్ 70 ఎయిర్ ఐఫోన్ ఎయిర్‌కి గట్టి ప్రత్యర్థి. త్వరలోనే హవాయ్, ఐఫోన్ ఎయిర్, మోటో ఎయిర్ స్లిమ్ ఫోన్ పోల్చిన వివరాలతో మళ్లీ కలుద్దాం.
Also Read: అత్యంత చిన్న గేమింగ్ పీసీ.. బుల్లి సైజులో పవర్‌ఫుల్ కంప్యూటర్ లాంచ్