Bro 2 Movie: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సముద్రఖని(Samuthirkani) ఒకరు. నటుడిగా పలు సినిమాలలో నటిస్తూనే ఈయన మరోవైపు దర్శకత్వం కూడా వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో బ్రో సినిమా(Bro Movie) చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో తెరకెక్కిన వినోదయ సిత్తం అనే సినిమాని తెలుగులో బ్రో పేరుతో 2023వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఫాంటసీ కామెడీ డ్రామాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ సరసన కేతిక శర్మ నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి సముద్రఖని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈయన కాంత (Kaantha)సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా వారు బ్రో 2 (Bro 2)సినిమా గురించి ప్రశ్నలు అడగడంతో సముద్రఖని ఆసక్తికర సమాధానాలు తెలిపారు. బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా ఉందని, పవన్ కళ్యాణ్ గారి అనుమతే ఆలస్యం ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా టెకాఫ్ అవుతుంది అంటూ ఈయన ఈ సినిమా అప్డేట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమాకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందో తెలియాల్సి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త సినిమాలుకు కమిట్ అవ్వలేదని చెప్పాలి. గతంలో ఈయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఫలానా డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు అంటూ రోజుకొక వార్త బయటకు వస్తోంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో పవన్?
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలకు సంబంధించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు కానీ ఈయన వంశీ పైడిపల్లి, లోకేష్ కనగరాజ్, అనిల్ రావిపుడి వంటి దర్శకులతో సినిమా చేయబోతున్నారని ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టులు ఏంటి అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలోనే బ్రో2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది అంటూ సముద్రఖనికి వెల్లడించడంతో ఈ సినిమా కోసమైనా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bhagya Shree Borse: మేడమ్ ను ఫస్ట్ పట్టింది మేమే… భాగ్య శ్రీ పై రానా కామెంట్స్!