BigTV English
Advertisement

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Nara Lokesh:  గత ఆరు నెలల కాలంగా మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారంట .. మంత్రుల పనితీరుపై అసంతృప్తి, ఆసహనం వ్యక్తం చేస్తున్నారంట … తాజాగా మంత్రుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది .. వారి వ్యవహారంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా మంత్రుల తీరులో మార్పు రావడం లేదంట .. అసలు వారి తీరేంటో? దానికి కారణం ఏంటో అదిస్థానానికి అంతు పట్టటం లేదట.


మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు:

ఏపీ క్యాబినెట్‌ మీటింగ్‌ జరిగే సమయాల్లో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వారి శాఖపై ఏమాత్రం పట్టు సాధించలేని పరిస్థితి నెలకొందని.. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోను…ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలోను మంత్రుల ఇవ్వాల్‌మెంట్‌ సరిగా ఉండడంలేదనే భావనలో సీఎం ఉన్నారనే గుసగసలు వినిపిస్తున్నాయి. అటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా మంత్రులు పాల్గొనలేకపోతున్నారనే చర్చ పార్టీ నేతల్లో ఉందట. సగం మంది మంత్రులు హైదరాబాద్, వైజాగ్, బెంగళూరులకు షటిల్ సర్వీస్ చేస్తున్నారనే విమర్శలున్నాయట.

క్యాబినెట్ భేటీలో మంత్రుల తీరుపై చర్చ:

గత ఆరు నెలల కాలంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో అక్కడక్కడా పర్యటనలు చేస్తూ.. ప్రభుత్వం పై సంబంధింత శాఖల మంత్రుల పై ఆరోపణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు గాని.. మిగిలిన వారు కానీ వైసీపీ నేతల నుంచి, జగన్‌ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇవ్వడంలో విఫమలవుతున్నారనే చర్చ టీడీపీలో నడుస్తోందట. ఈ విషయమై ప్రతి క్యాబినెట్ భేటీలోను మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు..


ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు:

వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు చెప్పటంలో మంత్రులు వైఫల్యం చెందుతున్నారని చంద్రబాబు అసంతృ వ్యక్తం చేస్తూనే ఉన్నారట. చంద్రబాబు ఎన్నిసార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట. తాజాగా మంత్రుల పై లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జోగి రమేష్ అరెస్టును బీసీలపై దాడి అన్నట్లు వైసీపీ ప్రోజెక్ట్‌ చేస్తే.. పార్టీ నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారని అడిగినట్లు టాక్ వినిపిస్తోంది.

గ్రీవెన్స్‌సెల్‌ను పట్టించుకోవడం లేదని లోకేష్ ఆగ్రహం:

ప్రతిపక్షంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రులు లైట్‌ తీసుకుంటున్నారనే ఫీలింగ్‌‌లో ఉన్న నాయకత్వానికి.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీవెన్స్ సెల్‌ను కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదనే చర్చ నడుస్తోందట. ప్రజాదర్బార్ విషయంలో నారా లోకేష్‌ కూడా సీరియస్‌ అయినట్లు చెప్తున్నారు. ప్రజా దర్బార్‍‌ను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన యువనేత, అసలు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం లేదని మండిపడ్డారట. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన లోకేష్, ఆ ప్రజా దర్బార్‍ కు వేల సంఖ్యలో ప్రజలు రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారట.

పార్టీ కార్యలయంలో ప్రజా దర్బార్:

సుమారు ఐదు గంటల పాటు సమస్యలు విని అసలు ఎందుకు ఈ ఇంతమంది సమస్యలతో పార్టీ కార్యాలయానికి వచ్చారంటే నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై నియోజకవర్గాల్లో, మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందనేని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భార్‌కు మంత్రులు తప్పుకుండా హాజరు కావాలిని ఆదేశాలు జారీ చేశారట.

ఆ క్రమంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయిలో మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోడంలేదా అనే చర్చ మొదలైందట. మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శల్ని దీటుగా ఎదుర్కొన లేకపోవడం మంత్రుల వైఫల్యంగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. 2014 -19 మధ్య కూడా వైసిపి చేసిన ప్రచారాన్ని ధీటుగా సమాధానం చేప్పకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఓటమి కారణంగా పార్టీ అధిష్టానం భావిస్తుందనే చర్చ కూడా పార్టీ నేతల్లో ఉందట.

మంత్రులు, ఎమ్మెల్యేలతో లోకేష్ సమావేశం:

గతంలో జరిగిన తప్పిదాన్ని మరోసారి జరక్కుండా చూసుకోవాలని అధిష్టానం భావిస్తుందట. విశాఖపట్నం సమ్మిట్ అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలతో లోకేష్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రతిపక్ష పార్టీ చేసే ప్రతి విమర్శకి సంబంధిత జిల్లా నుంచి అయితే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు.. రాష్ట్రస్థాయిలో అయితే ఆ శాఖ మంత్రి, ప్రభుత్వ అధికారులతో వెంటనే రిప్లై ఇప్పించాలని యోచిస్తున్నారట.

పార్టీ, ప్రభుత్వం రెండు కలిసి పనిచేసే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తుందట. త్వరలోనే ఫాక్ట్ చెక్ పేరుతో టీడీపీ కమిటీ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నేతలు చెబుతున్నారట. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు.. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు.. దానికి కౌంటర్ గా ఏ రకంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై కమిటీ వేసే ఆలోచనలో టీడీపీ ఉందట. టీడీపీ అధిష్టానం కార్యచరణ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Story By Apparao, Big Tv

 

Related News

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×