OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాంటి వెబ్ సిరీస్ లు ఓటీటీలో ట్రెండ్ సెట్ చేశాయి. పాలిటిక్స్, బ్యాక్‌స్టాబ్బింగ్, బ్రూటల్ యాక్షన్, హాట్ రొమాన్స్ తో వీటిని కళ్లార్పకుండా వీక్షిస్తున్నారు ఆడియన్స్. అయితే వీటిలో రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి హాట్ కంటెంట్ ను మళ్ళీ తనివి తీరా చూడాలనుకుంటే ‘Spartacus’ అనే సిరీస్ పై కూడా ఓ లుక్ వేయండి. 2010-2013 మధ్య వచ్చిన ఈ హిస్టారికల్ సిరీస్ రోమన్ కాలంలో స్పార్టకస్ అనే థ్రేషియన్ వారియర్ గా మారి, రోమన్ రిపబ్లిక్‌పై రెబెలియన్ చేసే కథగా తెరకెక్కింది. ఇందులో యాక్షన్ సీన్స్ ‘300’ మూవీ స్టైల్‌లో అదిరిపోతాయి. ఓటీటీలో ఈ సిరీస్ ని ఒంటరిగా చూస్తే హార్ట్ రేట్ మాత్రం పెరిగిపోతుంది. ఐయండిబిలో దీనికి 8.5/10 రేటింగ్ ఉండటం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
మొత్తం 4 సీజన్స్ 39 ఎపిసోడ్స్ ఉన్న ‘Spartacus’ సిరీస్ ను స్టీవెన్ S. డినైట్ రూపొందించారు. ఇందులో లూసీ లాలెస్ , జాన్ హన్నా, మాను బెన్నెట్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ అమెరికన్ హిస్టారికల్ టెలివిజన్ సిరీస్, 2010 జనవరి 22న మొదలై, 2013 ఏప్రిల్ 12న ముగిసింది. ప్రస్తుతం ఈ సిరీస్ Netflix, Lionsgate Play, Amazon prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ
మొదటి సీజన్‌లో థ్రేసియన్ యోధుడు స్పార్టకస్ రోమన్ సైన్యంలో చేరి గెటే తెగలతో యుద్ధం చేస్తాడు. లెగేటస్ అతన్ని మోసం చేసి, దేశద్రోహిగా ముద్రవేసి మరణశిక్ష వేస్తాడు. అతని భార్య సురాను బానిసగా చేస్తాడు. స్పార్టకస్ మరణశిక్ష నుంచి తప్పించుకుని నలుగురు గ్లాడియేటర్లను చంపి, మరో చోట కఠిన యుద్ధ శిక్షణ పొందుతాడు. అక్కడ నలుగురు గ్లాడియేటర్లతో స్నేహం చేస్తాడు. ఓనోమాస్ శిక్షణలో ఎదిగి, షాడో ఆఫ్ డెత్ థియోకోల్స్‌ను ఓడించి చాంపియన్ అవుతాడు. భార్య సురాతో పాటు, మరికొంత మంది చనిపోయారని తెలిసి స్పార్టకస్ రగిలిపోతాడు. రోమ్‌కు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు మొదలుపెడతాడు. అతనితో పాటు, మిగతా తిరుగుబాటు దారులు చేయి కలుపుతారు. మరి రోమ్ పై అతని దండయాత్ర ఎలా ఉంటుందనేది, చరిత్రలో నిలిచిపోయిన ఈ ఎపిక్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.