Phaphey Kuttniyan OTT : నీరు బజ్వా, టానియా హీరోయిన్స్‌గా నటించిన పంజాబీ సినిమా ‘ఫాఫే కుట్నియన్’ (Phaphey Kuttniyan). ఈ మూవీ థియేటర్లలో 2025న ఆగస్ట్ 22న రిలీజ్ అవ్వడంతో పాటు, మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ప్రేమ్ సింగ్ సిద్ధు దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ కామెడీ సినిమా పంజాబ్ కిట్టీ పార్టీల్లో ఎప్పుడూ ముందుండే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వాళ్లు అందాన్ని ఎరగా వేసి డబ్బులను దోచుకుంటూ ఉంటారు. అమృత్ అంబీ, ప్రభ్ బైంస్, నీషా బానో, గుర్బాజ్ కల్రా లాంటి సపోర్టింగ్ కాస్ట్‌తో బ్రదర్‌హుడ్ ప్రొడక్షన్స్, నీరు బజ్వా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ కి డేట్ కూడా అనౌన్స్ వచ్చింది. తొందర్లోనే ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టబోతోంది. ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ నుంచి దాదాపు 3 నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. 2025 నవంబర్ 27 నుంచి చౌపాల్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. పంజాబీ కంటెంట్ స్పెషలిస్ట్ చౌపాల్‌లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ జరుగుతుంది. ఈ సినిమాలో పేదరికంతో పోరాడుతూ, లైఫ్ చేంజ్ చేసుకునే ఇద్దరు మహిళలతో వచ్చే ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ఐఎండిబిలో 5.8/10 రేటింగ్ తో బాక్సాఫీస్‌లో యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
Read Also : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ
పంజాబ్‌లో పేదరికంలో పెరిగిన ఇద్దరు మహిళలు, తమ జీవితాలను మార్చుకోవాలనే డిటర్మినేషన్‌తో కాన్ విమెన్ గా మారతారు. గ్లామరస్ కిట్టీ పార్టీల ప్రపంచంలో వీళ్ళు సాధారణంగా కనిపిస్తుంటారు. కానీ వీళ్ళు కిట్టీ పార్టీల్లో పదేపదే గెలుస్తూ, ధనవంతులైన హౌస్‌వైవ్స్‌ను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తారు. వారి స్కీమ్‌లు చాలా రహస్యంగా ఉంటాయి. కానీ వీళ్ళ అనుమానాస్పద విజయాలు పోలీసుల దృష్టిలో పడతాయి. దీంతో ఒక పెద్ద దర్యాప్తు మొదలవుతుంది. వైల్డ్ ట్విస్ట్‌లతో నిండిన వీళ్ళ జర్నీలో పోలీసులు వారిని పట్టుకుంటారా? లేక వాళ్ళు ఎస్కేప్ అవుతారా? ఈ దర్యాప్తులో వాళ్ళ మోసాల వెనుక అసలు రహస్యాలు బయటపడతాయా ? అనే విషయాలను, ఈ పంజాబీ సినిమాని చూసి తెలుసుకోండి.