BigTV English

Siddharth- Aditi: సిద్దార్థ్- అదితి పెళ్ళికి ఇంతమంది సెలబ్రిటీలు వచ్చారా.. ?

Siddharth- Aditi: ఈ ఏడాది స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు చాలా జరిగాయి. అందులో సిద్దార్థ్- అదితిరావు హైదరీ జంటది కూడా ఒకటి.

అందాల ముద్దుగుమ్మ అదితిరావు హైదరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక లవర్ బాయ్ సిద్దార్థ్ కు తెలుగులో సపరేట్  ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. బాయ్స్  సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దు.. ఇప్పటివరకు ఎన్నో మంచి సినిమాలను అభిమానులకు అందించాడు.

అదితి- సిద్దార్థ్  మహాసముద్రం సినిమా సమయంలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారి పరిణయం వరకు వెళ్ళింది.

ఇక వీరి నిశ్చితార్థం, పెళ్లి రెండు కూడా చాలా సీక్రెట్ గా జరిగాయి. పెళ్లి అయిన కొన్నిరోజులు అదితి.. తన పెళ్లి ఫోటోలను అభిమానులతో షేర్ చేసిన విషయం తెల్సిందే.

ఇక ఈ జంట పెళ్లి తరువాత మొదటి దీపావళీని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దీపాల పండగ రోజున తమ పెళ్ళికి వచ్చిన అతిధుల ఫోటోలను అదితి అభిమానులతో పంచుకుంది.

తన తల్లిదండ్రులతో పాటు.. గురువులు, శ్రేయోభిలాషులు తమ పెళ్ళికి హాజరయ్యారని, మన ఎదుగుదలను చూడడమే కాకుండా ఆ ఎదుగుదలకు కారణమైన ఈ ప్రత్యేక వ్యక్తుల సమక్షంలో మేము ఉండటం ఎంతో అద్భుతమని ఆమె రాసుకొచ్చింది. ఇక సిద్దు- అదితిల  పెళ్ళికి కమల్ హాసన్ కూడా హాజరయ్యారు. 

సిద్దు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. మణిరత్నం దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు పనిచేశాడు. ఆయన దర్శకత్వంలో అదితి సైతం చెలియా అనే చిత్రంలో నటించింది.

తమకు గురువుగా ఉన్న మణిరత్నం ను ఆయన ఫ్యామిలీని పెళ్ళికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మణిరత్నం భార్య సుహాసిని తదితరులు పెళ్లిలో కనిపించారు.

వీరందరి సమక్షంలో సిద్దు- అదితిల వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వారు సంతకాలు చేస్తూ కనిపించారు.

ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్లి చేసుకొని ఒకటి కావడంతో  ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ జంట కలకాలం ఇలానే సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు.

ఇక సిద్దార్థ్ కు అదితికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిన విషయం కూడా తెల్సిందే. ఇద్దరు ముందువారికి విడాకులు ఇచ్చేసి.. సింగిల్ గా ఉంటున్న సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లితో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం సిద్దార్థ్..  వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే చిన్నా సినిమాతో  మంచి విజయాన్ని అందుకున్న సిద్దు.. అలాంటి కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని అంటున్నాడు.

ఇక అదితి సైతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×