Kajal Aggarwal: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 4th T20I) మధ్య ఇవాళ నాలుగో టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. క్వీన్స్ ల్యాండ్ ( Carrara Oval, Queensland) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా. టాస్ ఓడిపోయినప్పటికీ… బ్యాటింగ్ లో టీమిండియా అదరగొడుతోంది. టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ 46 పరుగులతో రాణించగా అభిషేక్ శర్మ, శివం దుబే, సూర్య కుమార్ యాదవ్ అందరూ బాగానే రాణించారు.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగోవ టి20 మ్యాచ్ లో టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెరిశారు. తన భర్తతో కలిసి ఈ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal). వీళ్లిద్దరే కాదు, కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ( Nisha Agarwal) ఫ్యామిలీ కూడా వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే మ్యాచ్ ప్రారంభం కాకముందు తన భర్తకు హగ్ ఇచ్చి ఫోటోలు దిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ఇద్దరు స్టేడియంలో సరదాగా కాసేపు గడిపారు. ఇక ఈ ఫోటోలలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలా అందంగా కనిపించారు. బిస్కెట్ కలర్ డ్రెస్ వేసుకున్న కాజల్ అగర్వాల్, తన అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ కెమెరామెన్ కాజల్ అగర్వాల్ ను చాలా సార్లు ఫోకస్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో ( Australia vs India, 4th T20I) భారత్ అద్భుతంగానే రాణించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్ గిల్ 46 పరుగులు చేసి రాణించగా చివరలో అక్షర్ పటేల్ 21 పరుగులతో దుమ్ము లేపాడు. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేస్తే, ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. మరి ఈ టార్గెట్ ను టీమిండియా కాపాడుకుంటుందా? లేదా? చూడాలి. ఈ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ 46 పరుగులతో దుమ్ములేపాడు. ఇందులో 4 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉంది. అలాగే, సూర్య కుమార్ యాదవ్ కూడా ఉన్నంత సేపు రెచ్చిపోయాడు. 20 పరుగులు చేసి, భారీ సిక్సర్ కు ప్రయత్నించి, వికెట్ కోల్పోయాడు. చివరలో వచ్చిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా తన వంతు ప్రయత్నం చేశాడు. 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు అక్షర్ పటేల్. దీంతో ఆ మాత్రం స్కోర్ సాధించింది టీమిండియా.
Themm ❤️ for #INDvsAUS #KajalAggarwal pic.twitter.com/SonnoijTRk
— 𝐊α𝗃αᥣ𝗂α𐓣 👻 (@Ayesha_kajalfan) November 6, 2025