Shilpa shetty -Raj Kundra: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ శిల్పా శెట్టి(Shilpa shetty) రాజ్ కుంద్రా (Raj Kundra)దంపతులు గత కొద్దిరోజులుగా వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ దంపతులు దీపక్ కొఠారి(Deepak Kothari) అనే వ్యాపారవేత్త నుంచి వ్యాపారాలలో పెట్టుబడులు నిమిత్తం 60 కోట్ల రూపాయలను తీసుకొని వాటిని వ్యాపారాలలో పెట్టుబడులుగా కాకుండా ఆ నిధులను పక్కకు మళ్ళించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. వ్యాపారాల నిమిత్తం తన వద్ద నుంచి తీసుకున్న 60 కోట్ల రూపాయలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించారని దీపక్ కొఠారి వీరిపై కేసు వేసిన సంగతి తెలిసిందే.
ఇలా 60 కోట్ల రూపాయల మోసం కేసులో భాగంగా వీరిపై కేసు నమోదు చేయడమే కాకుండా కేసు విచారణలో ఉండగా శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులు తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుండడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఈ విషయంపై దృష్టి సారిస్తూ ఏకంగా శిల్పా శెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఇలా ఈ దంపతులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తును చేపట్టింది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా కేసు కీలక మలుపు తిరిగిందని తెలుస్తోంది.
శిల్పా శెట్టి దంపతులు మోసానికి పాల్పడిన 60 కోట్ల రూపాయలను దారి మళ్లించిన నలుగురు ఉద్యోగస్తులను అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే ఈ మోసంలో పాల్పడిన ఈ నలుగురు ఉద్యోగులు కూడా రాజుకుంద్రా శిల్పా శెట్టి కంపెనీలలో ఉన్నత హోదాలో ఉన్న వారేనని తెలుస్తోంది. అయితే ఈ నలుగురిలో పోలీసులు ఇప్పటికే ఒకరిని విచారణ చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విచారణలో భాగంగా 60 కోట్ల రూపాయలు గురించి పలు ప్రశ్నలు వేస్తూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో భాగంగా నలుగురికి నోటీసులను జారీ చేసి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
జైలు పాలైన రాజ్ కుంద్రా..
ఈ విధంగా ఈ నలుగురు వ్యక్తులు కనుక 60 కోట్ల రూపాయల విషయంలో నోరు విప్పితే కచ్చితంగా శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులు చిక్కుల్లో పెడతారని స్పష్టమవుతుంది. మరి ఈ విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాల్సి ఉంది. శిల్పా శెట్టి దంపతులు గత కొద్దిరోజులుగా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ 60 కోట్ల రూపాయల కేసులో భాగంగా ఈ దంపతులు బయటపెడతారా? లేకుంటే శిక్షణ ఎదుర్కొంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇదివరకు రాజ్పో కుంద్రా వీడియోలు వివాదంలో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే మరోసారి ఈ 60 కోట్ల రూపాయల కేసులో చిక్కుకున్నారు.