CM Chandrababu: పౌరులకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులను దిద్దుతూ ముందుకు వెళ్తున్నాం. నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి. అధికారులు ఈ విధానాన్ని అమలు చేసే విధంగా చూడాలన్నారు. సందేహలుంటే ఆర్టీజీఎస్ లో నివృత్తి చేసుకోవాలి. డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం. ’’ అని అన్నారు.
“డేటా ఆధారిత పాలన”పై నిర్వహించిన సదస్సులో ఆయన కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు”గా మార్చి, సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించడం వల్లే ఇటీవల సంభవించిన తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆయన గుర్తుచేశారు.
Read Also: ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు
డేటా ఆధారిత పాలన భవిష్యత్తుకు అత్యంత కీలకమని నొక్కిచెప్పిన సీఎం, వచ్చే జనవరి నుంచే అమరావతిలో క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సీఎఫ్ఎంఎస్ (CFMS) వ్యవస్థ ద్వారా వనరులను సమర్థంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుతూ, “2047 విజన్ డాక్యుమెంట్” లక్ష్యాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులను కోరారు.
ప్రతీ నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారితో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఆయా శాఖలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.