Tata Motors: భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది. వారు సాధించిన ఈ అద్భుత విజయానికి గుర్తుగా టాటా మోటార్స్.. త్వరలో విడుదల కాబోతున్న టాటా సియోరా కారు మొదటి లాట్ ని అందజేస్తామని ప్రకటించింది.
Also Read: PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్
కంపెనీ జట్టు సభ్యులందరికీ టాప్ – ఎండ్ మోడల్ ని ఇస్తుంది. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదని.. వారి అద్భుతమైన ధైర్య సాహసాలు, దేశానికి గర్వకారణం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన గౌరవం అని పేర్కొంది టాటా మోటార్స్. ధైర్యం, పట్టుదల, ప్రేరణలతో నిండిన ఈ మహిళలు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది మనసులను గెలుచుకున్నారని.. లెజెండరీ టాటా సియెరా తిరిగి రాబోతున్నట్లే.. ఈ జట్టు కూడా నిలకడ, శక్తి, నిజమైన లెజెండ్ ఆత్మను చూపించిందని పేర్కొంది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. “భారత మహిళా క్రికెట్ జట్టు తమ అద్భుత ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేసింది. వారి ప్రయాణం, పట్టుదల, విశ్వాసం యొక్క శక్తికి ఇది ప్రతీక. ఈ విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం. టాటా మోటార్స్ ఈ లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన టాటా సియోరా ను బహుమతిగా ఇవ్వడం గర్వకారణం. ఇది ఇద్దరు దిగ్గజాల ఉమ్మడి స్ఫూర్తి కి, అనంతమైన ప్రేరణకు చిహ్నం” అని అన్నారు.
టాటా సియోరా ని నవంబర్ 25వ తేదీన అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ఎస్.యూ.వీ ముఖ్యమైన ఫీచర్లలో 11-2 ADAS {అడ్వాన్సుడ్ డ్రైవర్ అసిస్టెంట్స్ సిస్టమ్}, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, అధునాతన కనెక్టివిటీ టెక్నాలజీ ఉంటాయని సమాచారం. ఇక ఇంజన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ టర్బో డీజిల్ వేరియంట్ లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Harleen Deol: మోడీ సార్.. ఎందుకు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫన్నీ క్వశ్చన్
అయితే ఈ కారు ధర వివరాలు అధికారికంగా తెలియజేయకపోయినా.. ధర సుమారు రూ. 13.50 లక్షల నుండి 24 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే విడుదల అయింది. డి.ఆర్.ఎల్, ఎల్ఈడి హెడ్ లాంప్స్, టెయిల్ లాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్టైలిష్ అల్లాయి వీల్స్ తో అద్భుతమైన డిజైన్ దీని ప్రత్యేకత. అలాగే ఇందులో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. అలాగే ఈ కారులో మొత్తం ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఈ కొత్త టాటా సియోరా మార్కెట్లో అనేక ఇతర suv లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
🚨 A NICE GESTURE BY TATA MOTORS 🚨
Tata Motors will gift "Sierra" to Women's World Cup winning members of Team India. 🇮🇳 pic.twitter.com/nXQlqsTPD0
— Johns. (@CricCrazyJohns) November 6, 2025