E-Paper
Advertisement

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?
Advertisement

Vivo V27 5G: వివో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది వివో వి27 5జి ద్వారా. లుక్‌, పనితీరు, కెమెరా అనే మూడు ప్రధాన విభాగాల్లో ఈ ఫోన్‌ దూసుకుపోయింది. వివో ఎప్పటిలాగే తన ఫ్యాషన్‌ స్టైలిష్‌ డిజైన్‌ను కొనసాగిస్తూ ఈసారి కర్వ్‌డ్‌ స్క్రీన్‌, సన్నని బాడీ, వెనుక గాజు ఫినిష్‌తో మనసును ఆకట్టుకునే లుక్‌ను ఇచ్చింది. ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకున్న క్షణం ప్రీమియం ఫీల్‌ వస్తుంది. లైట్‌ పడినప్పుడు రంగు మారే ఫోటోక్రోమిక్‌ టెక్నాలజీ దీనికి ప్రత్యేక ఆకర్షణ.

స్మూత్‌గా డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే, వివో వి27 5జిలో 6.78 అంగుళాల అమోలేడ్ కర్వ్‌డ్‌ స్క్రీన్‌ ఇచ్చారు. ఇది పూర్తి హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్‌ రేట్‌ కలిగి ఉంది. అంటే యూజర్‌ ఏ వీడియో చూడినా, గేమింగ్‌ ఆడినా లేదా స్క్రోలింగ్‌ చేసినా పూర్తిగా స్మూత్‌గా, స్పష్టంగా కనిపిస్తుంది. కలర్‌లు చాలా ప్రకాశవంతంగా, సహజంగా ఉండటం వల్ల విజువల్‌ అనుభవం మరింత బాగుంటుంది. హెచ్‌డిఆర్ 10 ప్లస్ సపోర్ట్‌తో ఈ డిస్‌ప్లే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసే వారికి మరింత సరిపోతుంది.

256Gజిబి స్టోరేజ్‌ వేరియంట్

Advertisement

పర్‌ఫార్మెన్స్‌ విషయంలో ఇది 5జి సపోర్ట్‌ చేసే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ చిప్‌సెట్‌ గేమింగ్‌, మల్టీటాస్కింగ్‌ వంటి పనుల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. 8జిబి లేదా 12జిబి ర్యామ్ ఆప్షన్లు, అలాగే 128జిబి లేదా 256Gజిబి స్టోరేజ్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 టెక్నాలజీ వల్ల వర్చువల్‌గా మరో 8జిబి ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల పెద్ద ఫైల్స్‌ ఓపెన్‌ చేయడం, యాప్స్‌ మార్చడం లేదా వీడియో ఎడిటింగ్‌ చేయడం స్మూత్‌గా జరుగుతుంది. హీట్‌ కంట్రోల్‌ కూడా బాగుంది కాబట్టి దీన్ని దీర్ఘకాలం గేమింగ్‌ కోసం కూడా ఉపయోగించవచ్చు.

766వి ప్రైమరీ కెమెరా

కెమెరా సెగ్మెంట్‌లో మాత్రం వివో తన నిజమైన శక్తిని చూపించింది. వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్‌ సోనీ ఐఎంఎక్స్766వి ప్రైమరీ కెమెరా ఉంది. దీని వెంట 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 2 మెగాపిక్సెల్‌ మాక్రో లెన్స్‌ ఉన్నాయి. ప్రధాన కెమెరాలో ఓఐఎస్ టెక్నాలజీని చేర్చారు కాబట్టి ఫోటోలు తీసేటప్పుడు లేదా వీడియో రికార్డ్‌ చేస్తున్నప్పుడు కంపించడం, బ్లర్‌ అవ్వడం జరగదు. పగలైనా రాత్రైనా ఈ కెమెరా ఇమేజ్‌ క్వాలిటీని అద్భుతంగా నిలబెడుతుంది.

Also Read: Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

సెల్ఫీ ప్రేమికులకు సూపర్ ఫోన్

సెల్ఫీ ప్రేమికులకు ఇది మరింత ఇష్టమవుతుంది, ఎందుకంటే ముందు భాగంలో 50 మెగాపిక్సెల్‌ ఆటో ఫోకస్‌ కెమెరా ఉంది. దీని ద్వారా తీసిన సెల్ఫీలు సహజంగా, స్పష్టంగా, లైటింగ్‌ ఉన్నా లేకున్నా క్వాలిటీగా వస్తాయి. వీడియో కాల్స్‌, రీల్స్‌, ఫోటోషూట్‌ వంటి పనుల్లో ఇది ప్రొఫెషనల్‌ లెవెల్‌లో ఫలితాలు ఇస్తుంది.

600mAh బ్యాటరీ హైలెట్

బ్యాటరీ విషయానికి వస్తే, వివో వి27 5జిలో 4600mAh సామర్థ్యమున్న బ్యాటరీని ఇచ్చారు. దీన్ని 66W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. అంటే కేవలం 20 నిమిషాల్లోనే సగం చార్జ్‌ అవుతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే ఒక రోజు సగటు వాడుకలో సులభంగా నడుస్తుంది.

సాప్ట్ వేర్ పరంగా సూపర్

సాఫ్ట్‌వేర్‌ పరంగా ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రూపొందించిన ఫన్‌టచ్ ఓఎస్ 13 పై నడుస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. నావిగేషన్‌, సెట్టింగులు, థీమ్స్‌, సెక్యూరిటీ ఆప్షన్లు అన్నీ బాగానే ఆప్టిమైజ్‌ చేశారు.

అందుబాటులో ధర

ధర విషయానికి వస్తే వివో వి27 5జి భారత మార్కెట్‌లో రూ.32,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఇది లభిస్తోంది. లుక్‌, కెమెరా, పర్‌ఫార్మెన్స్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అన్నీ కలిపి చూస్తే ఇది మిడ్‌రేంజ్‌ ఫోన్లలో ఒక బెస్ట్‌ ఆప్షన్‌. మీరు కెమెరా, డిస్‌ప్లే, డిజైన్‌ ముఖ్యంగా చూసే వారు అయితే వివో మీకు సరైన ఎంపిక అవుతుంది.

Related News

పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఫోన్ కెమెరా బ్లర్‌గా ఉందా? వాటర్ మాయిశ్చర్ తొలగించే బెస్ట్ హ్యాక్స్!

120Hz డిస్‌ప్లే నిజంగానే ఎక్కువ ఛార్జింగ్ లాగేస్తుందా?అసలు నిజం ఇదే!

ఫోన్ ఛార్జింగ్ అవట్లేదా? ఈ చిన్న పొరపాట్లే USB పోర్ట్‌ను పాడుచేస్తాయి

ఆస్ట్రేలియాలో రాక్షస సాలీడు.. శాటిలైట్ ఫోటోతో అసలు సంగతి చెప్పేసి నాసా

వింటర్‌లో కాలుష్యం నుంచి ఫుల్ సేప్టీ..ఏసీలో ఈ ఒక్క మోడ్ ఉంటే చాలు!

ఒకప్పుడు భూమిపై అసలు ఆక్సిజనే ఉండేది కాదట, దీని పుట్టక భలే విచిత్రం

స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయ్యారా? డిజిటల్ డిటాక్స్ కోసం ఈ 5 మినీ గ్యాజెట్స్‌ను ట్రై చేయండి!

Big Stories

Advertisement
×