Rashmika: సినీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె నటించిన వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో రిలేషన్ లో ఉన్న ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని ఇదివరకే నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎక్కడ అధికారికగా స్పందించలేదు కానీ పరోక్షంగా నిశ్చితార్థం అయినట్టు రష్మిక తెలియజేస్తూ వస్తున్నారు.
ఇకపోతే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జగపతిబాబు హోస్టుగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా జగపతిబాబు (Jagapathi Babu) రష్మిక మధ్య సరదా సంభాషణ కొనసాగింది. మీకు ఎప్పుడైనా నన్ను కలవాలి అనిపిస్తే జిమ్ కు వచ్చేయండి అంటూ రష్మిక చెప్పారు రమ్మంటున్నారు కానీ ఏ జిమ్ అని చెప్పడం లేదు అంటూ హైదరాబాదులో అయితే రౌడీ జిమ్ అని జగపతిబాబు చెప్పడంతో ఒక్కసారిగా రష్మిక సిగ్గు పడిపోయింది. త్వరలోనే రౌడీ జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను వచ్చేసేయండి నేనే మీకు ట్రైనర్ గా మారిపోతాను అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రష్మిక పేరు గురించి మాట్లాడుతూ నీ పేరు చాలా అందమైన పేరు కానీ దానిని అటు చేసి ఇటు చేసి పూర్తిగా క్రష్ చేశారు.. మరి మీ క్రష్ ఎవరో చెప్పండి అంటూ జగపతిబాబు అడగడంతో రష్మిక మాత్రం సిగ్గుపడుతూ కనిపించారు. అలాగే అక్కడే ఉన్న ఆడియన్స్ ను ఎవరో మీరే చెప్పండి అన్నట్టు సైగా చేశారు. ఆ పేరు ఏంటో మాకు చెప్పరా? అంటూ జగపతిబాబు అడగడంతో ఫిల్ ఇన్ ది బ్లాంక్ మీరే ఫిల్ చేసుకోండి అంటూ రష్మిక చెప్పగా.. ఉన్నది ఒకటే బ్లాక్ అంటూ జగపతిబాబు మాట్లాడారు.
విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం..
మీ క్రష్ ఒక్కరే అని చెప్పాలనుకుంటే ఎవరు అంటూ మరోసారి జగపతిబాబు అడగగా విజయ్ అనే పేరు మీలో ఎవరైనా ఉన్నారా? అంటూ రష్మిక ఓపెన్ అయ్యారు. వెంటనే జగపతిబాబు నేను ఇప్పుడే విజయ్ జగపతిగా పేరు మార్చుకుంటున్నాను అంటూ మాట్లాడటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండతో తనకు నిశ్చితార్థం జరిగిందని ఆయనే తన క్రష్ అంటూ పరోక్షంగా అన్ని విషయాలను రష్మిక బయట పెట్టారు. ఇక రష్మిక కెరియర్ విషయానికి వస్తే నవంబర్ 7వ తేదీ ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించారు. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Shilpa Shetty -Raj Kundra: రూ. 60 కోట్ల మోసం కేసులో బిగ్ ట్విస్ట్… చిక్కుల్లో శిల్పా శెట్టి దంపతులు!