Darkness Around The Lips: పెదవుల చుట్టూ చర్మం నల్లగా మారడాన్ని “పెరియోరల్ హైపర్ పిగ్మెంటేషన్” అంటారు. దీనికి ముఖ్య కారణాలు సూర్యరశ్మి, హార్మోన్ల మార్పులు డ్రై స్కిన్, కొన్ని రకాల మందులు.. లేదా టూత్‌పేస్ట్ రసాయనాలు కావచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కింద ఇచ్చిన సహజ చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
1. నిమ్మరసం, తేనె, రోజ్ వాటర్ :
ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి పెదాల చుట్టూ నల్లగా ఉన్న ప్రాంతంలో రాత్రి పడుకునే ముందు రాయండి. ఇలా చేయడం వల్ల నిమ్మరసంలో ఉండే సహజమైన బ్లీచింగ్ గుణాలు (సిట్రిక్ యాసిడ్) చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. తేనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అంతే కాకుండా రోజ్ వాటర్ సమస్యను దూరం చేస్తుంది.
2. కలబంద గుజ్జు:
రాత్రి పడుకునే ముందు లేదా రోజులో 2 , 3 సార్లు స్వచ్ఛమైన కలబంద గుజ్జును నల్లగా ఉన్న చోట రాసి, మృదువుగా మసాజ్ చేయండి. కలబందలో “అలోయిన్” అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండార్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, నలుపును క్రమంగా తొలగిస్తుంది.
3. బంగాళదుంప రసం:
చిన్న బంగాళదుంపను తురిమి రసం తీయండి. ఈ రసాన్ని కాటన్ బాల్ సహాయంతో నలుపు ఉన్న ప్రాంతంలో రోజుకు రెండుసార్లు అప్లై చేసి, 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
బంగాళదుంపలో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు,కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటాయి. ఇవి చర్మం రంగును తేలిక పరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
4. శనగపిండి, పసుపు ప్యాక్ :
ఒక టీస్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, కొద్దిగా పాలు (లేదా పెరుగు) కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీనిని ప్యాక్‌లా వేసి.. ఆరిన తర్వాత మృదువుగా రుద్దుతూ శుభ్రం చేయండి. శనగపిండి మృత కణాలను తొలగించి.. ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా పసుపులోని కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల నలుపును తగ్గిస్తుంది.
5. పాల మీగడ, పాలు:
కొద్దిగా పాల మీగడ, పాలను కలిపి రాత్రిపూట జిడ్డుగా ఉన్న ప్రాంతంలో అప్లై చేసి, ఉదయం శుభ్రం చేయండి. పాల ఉత్పత్తులలో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మం పైపొరను సున్నితంగా తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది నలుపును తగ్గిస్తుంది. చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.
Also Read: ఉదయం పూట కాకరకాయ జ్యూస్ తాగితే.. ఈ రోగాలన్నీ పరార్ !
6. గంధపు పొడి , రోజ్ వాటర్:
ఒక టీస్పూన్ గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి ప్యాక్‌లా వేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. గంధపు పొడి చల్లదనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా చర్మం రంగును తేలికపరుస్తుంది. ఇది పిగ్మెంటేషన్ , టానింగ్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
7. దోసకాయ జ్యూస్:
దోసకాయ రసాన్ని తీసి.. కాటన్ నలుపు ఉన్న ప్రాంతంలో రాసి.. 15 నిమిషాల పాటు ఉంచండి. దోసకాయలో ఉండే తేమ మరియు తేలికపాటి బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి.