Aishwarya Rajesh (Source: Instragram)
తెలుగు బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు బ్యూటీ అయినప్పటికీ తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Aishwarya Rajesh (Source: Instragram)
అక్కడే తన టాలెంట్ ను నిరూపించుకొని స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
Aishwarya Rajesh (Source: Instragram)
అక్కడ భారీ క్రేజ్ లభించడంతో టాలీవుడ్ లో కూడా అవకాశాలు లభించాయి. అలా హోమ్లీ క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా సరైన గుర్తింపు మాత్రం లభించలేదు.
Aishwarya Rajesh (Source: Instragram)
కానీ ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని.. స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Aishwarya Rajesh (Source: Instragram)
ప్రస్తుతం వరుసగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి .ఈ నేపథ్యంలోనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Aishwarya Rajesh (Source: Instragram)
ఇక తాజాగా ఎల్లో కలర్ పట్టుచీర ధరించి అందుకు తగ్గట్టుగా లాంగ్ హారంతో మహారాణిలా కనిపించిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య రాజేష్ చీరకట్టులో చాలా అద్భుతంగా కనిపించిందని చెప్పవచ్చు.