BigTV English

Paradise Movie : ‘ప్యారడైజ్’ మూవీకి నాని తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Paradise  Movie : ‘ప్యారడైజ్’ మూవీకి నాని తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Paradise Movie : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య నటిస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ని అందుకోవడంతో పాటుగా భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. గతఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. హాయ్ నాన్న, అలాగే సరిపోదు శనివారం సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ అయ్యాయి. ఇవే కాదు మొదటి సినిమా నుంచి నాని తన సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ ను అందుకున్నాడు. ఒక్కో వేరియేషన్లలో ఒక్కో సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీ లోకి వచ్చినా అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని అందుకున్నాడు నాని. ప్రస్తుతం నాని ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మొదటిది హిట్ 3, రెండో చిత్రం ది పారడైజ్.. అయితే ఇప్పుడు నాని సినిమాలు హిట్ అవ్వడంతో నాని రెమ్యూనరేషన్ కూడా పెంచాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ప్యారడైజ్ సినిమాకు నాని తీసుకుంటున్నారు రెమ్యూనిరేషన్ ఇదే అంటూ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది మరి ఆ సినిమాకు నాని ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


హీరో నాని కేవలం హీరోగా మాత్రమే కాదు అటు డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్నాడు. గతంలో ఆయన నిర్మించిన సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. దసర , హాయ్ నాన్నా , సరిపోదా శనివారం లాంటి సినిమాలతో మంచి విజయాలను సాధించి ఇప్పుడు మరోసారి హిట్ 3, ప్యారడైజ్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ చిత్రాలతో నాని పాన్ ఇండియా హీరో అయ్యాడు.. నాని సినిమాలో కథలు ఎంపిక విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ ని మైంటైన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తుంటాయి..

Also Read : నాన్న ఎన్నో ఇబ్బందులు పడ్డాడు…డైరెక్టర్ మారుతి జీవితం తెలిస్తే గుండె బరువెక్కడం ఖాయం..


ప్రస్తుతం నాని శైలేష్ కొలనుదర్శకత్వం లో హిట్ 3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నాడు.. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు వరకు నాని 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ది పారడైజ్ సినిమాకి ఎక్కువగానే రెమ్యూనికేషన్ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్యారడైజ్ సినిమా కోసం ఏకంగా 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.. ఈ సినిమా స్టోరీ అయితే కాస్త కొత్తగా ఉండడంతో నాని ఈసారి ఈ సినిమాతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్తాడని తెలుస్తుంది ఇటీవల రిలీజ్ అయిన టీజర్ భారీ రెస్పాన్స్ని అందుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×