Bus Incident: ఘోర ప్రమాదం తప్పింది.. కొందరు అయితే నాకేందుకులే నా ప్రాణాలు ఉంటే చాలు అనుకునే రోజుల్లో నా ప్రాణానికి ఏమైన పర్లేదు.. నన్ను నమ్మి బస్సు ఎక్కిన వారు అందరు బాగుండాలని గొప్ప త్యాగానికి సిద్దమయ్యాడు ఈ బస్సు డ్రైవర్… అసలు ఏం జరిగింది అంటే.. బస్ నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. వచ్చింది. కానీ తనపై ఆధారపడి ఉన్న 50 మంది ప్రాణాలే తన ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నాడు ఆ బస్సు డ్రైవర్. గుండె పోటు రావడంతో బస్సు పక్కనే ఆపి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కోనసీమ జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది.
రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్ డ్రైవర్‌గా విధులు
ఈ ఘటన కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన 60 ఏళ్ల దెందుకూరి నారాయణరాజు రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాల బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం విద్యార్థులను గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు బస్సులో తరలిస్తుండగా మడికి 216ఏ జాతీయ రహదారిపై వెళుతూ అస్వస్థకు గురయ్యాడు.
Also Read: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్ తుపాను.. స్పాట్‌లో 20 మంది
విద్యార్థులను కళాశాలకు బస్సులో తరలిస్తుండగా.. మడికి హైవేపై అస్వస్థకు గురైన నారాయణరాజు
నారాయణ రాజుకు గుండెపోటు రావడంతో బస్సును మధ్యలోనే ఆపేశాడు. క్రిందకు దిగి జాతీయ రహదారి డివైడర్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులు గమనించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలను కోల్పోయాడు. డ్రైవర్ నారాయణరాజు తను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో గౌరవంగా ఉన్న నారాయణరాజు వారి కళ్ల ఎదుటే చనిపోవడంతో విద్యార్థులు కంటతడి పెట్టారు.