Kranti Gaud: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( 2025 Women’s Cricket World Cup ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళల జట్టులో ఉన్న ప్లేయర్లందరూ హాట్ టాపిక్ అయ్యారు. చాలా మంది క్రికెటర్ల పేర్లు అందరికీ తెలిసిపోయాయి. వాళ్ల ఆట తీరును కూడా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అభిమానులు తిలకించారు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు వరుసగా ఆయా రాష్ట్రాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నజరానాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా లేడీ బుమ్రా క్రాంతి గౌడ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అప్పుడెప్పుడో 13 సంవత్సరాల కిందట కోల్పోయిన పోలీస్ ఉద్యోగాన్ని తన తండ్రికి మళ్ళీ గిఫ్టుగా ఇచ్చింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. టీమిండియాకు క్రాంతి గౌడ్ సేవలు అందించిన నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
మహిళల వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీం జట్టులో సభ్యులు అయిన క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆమెకు చెక్కు కూడా అందించింది. ఆ డబ్బులతో పాటు ఆయన తండ్రికి పోలీసు ఉద్యోగం తిరిగి ఇచ్చింది మధ్యప్రదేశ్ సర్కార్. 2012 ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్ల కారణంగా క్రాంతి గౌడ్ తండ్రి మున్నా సింగ్ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అప్పటి నుంచి ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడింది. ఆర్థికంగా ఆమె తండ్రి ఇతర పనులు చేసి కుటుంబాన్ని నడిపించాడు.
అయితే ఇప్పుడు టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో, క్రాంతి గౌడ్ ( Kranti Gaud) తండ్రికి మళ్ళీ కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటన నేపథ్యంలో క్రాంతి గౌడ్ కుటుంబంలో మళ్లీ కొత్త ఉత్సాహం మొదలైంది. తన తండ్రిని మళ్లీ యూనిఫాంలో చూడటం తన డ్రీమ్ అని పేర్కొంది. ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కళ అంటూ క్రాంతి ఎమోషనల్ అయ్యారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా డబ్బులు లేవని, చాలా కష్టపడ్డామని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది క్రాంతి గౌడ్. టీమిండియా లేడీ బుమ్రా క్రాంతి గౌడ్ మంచి ఫాస్ట్ బౌలర్. వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున అద్భుతంగా రాణించారు. వరల్డ్ కప్ గెలవడంలో క్రాంతి గౌడ్ పాత్ర కూడా ఉంది.
🚨 After 13 long years, World Cup winner Kranti Gaud’s father is set to be reinstated in his police job — a long-overdue moment of justice and pride. ⚡️🇮🇳 pic.twitter.com/EqwMZAwcAg
— OneVision Media (@onevision_media) November 10, 2025