రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన వినియోగదారులకు గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న వారికి 18 నెలల ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. సుమారు రూ. 35,100 విలువైన ఈ ప్లాన్, అధునాతన AI టూల్స్, క్లౌడ్ స్టోరేజ్ ను ఒకే సబ్‌స్క్రిప్షన్ కింద కల్పిస్తోంది. ఈ ఆఫర్ ను అక్టోబర్ చివరలో అనౌన్స్ చేసింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా MyJio యాప్ లో అర్హత కలిగిన కస్టమర్లకు కనిపిస్తుంది.
జియో, గూగుల్ మధ్య ఒప్పందంలో భాగంగా, జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్లకు సభ్యత్వం పొందిన కస్టమర్లు గూగుల్ జెమిని ప్రోకు ఉచిత యాక్సెస్ ను పొందుతున్నారు. ఈ ప్లాన్ లో Google One ద్వారా Gemini 2.5 Pro, Nano Banana, Veo 3.1, 2 TB క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ ఉంటుంది. ఈ నిర్ణయం Google AI టెక్నాలజీని Jio విస్తృతమైన నెట్ వర్క్, 5G మౌలిక సదుపాయాలతో కలపడం ద్వారా AI యాక్సెసిబిలిటీని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఈ విస్తరణ దశల వారీగా జరుగుతోంది. రూ. 349, అంతకంటే ఎక్కువ ధర గల Jio Unlimited 5G ప్లాన్లను కలిగి ఉన్న 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వినియోగదారులకు యాక్సెస్ ఇవ్వబడుతోంది. కొంతమంది కస్టమర్లు ఇప్పటికే MyJio యాప్ లో కన్ఫార్మ్ మెసేజ్ లు పొందుతున్నారు. ‘Google Gemini Pro ప్లాన్ ఇప్పటికే మీ నంబర్ లో యాక్టివ్ గా ఉంది’ అని నోటిఫికేషన్ వస్తోంది. వినియోగదారులు Google One యాప్ లో సబ్ స్క్రిప్షన్ ను కూడా కన్ఫార్మ్ చేసుకోవచ్చు.
⦿ ముందుగా MyJio యాప్ ఓపెన్ చేయండి.
⦿ మెయిన్ స్క్రీన్ లో Google Gemini ఆఫర్ బ్యానర్ కనుగొనండి.
⦿ ‘మరిన్ని తెలుసుకోండి’, ‘ఇప్పుడే క్లెయిమ్ చేయండి’ మీద ట్యాప్ చేయండి.
⦿ ప్రాంప్ట్ చేసినప్పుడు Gmail IDని ఉపయోగించి సైన్ ఇన్ చేయాలి.
⦿ Jio వెబ్ పోర్టల్ ద్వారా నిర్ధారణ కన్ఫార్మ్ కాగానే Gemini Pro ఫీచర్లను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
వినియోగదారులు తమ జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ను కలిగి ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ యాక్టివ్ గా ఉంటుంది. నెట్‌వర్క్ లను డౌన్ గ్రేడ్ చేయడం లేదంటే మార్చడం వల్ల ఈ ఆఫర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రోల్ అవుట్ నెమ్మది నెమ్మదిగా జరుగుతున్న నేపథ్యంలో, అర్హత ఉన్న వినియోగదారులు వేర్వేరు సమయాల్లో యాక్సెస్ పొందవచ్చు. జెమిని ప్రో ప్లాన్ జియో వినియోగదారులకు AI, క్లౌడ్ స్టోరేజ్, ప్రొడక్టివిటీ టూల్స్ ఒకే ప్యాకేజీలో కలపడం ద్వారా మెరుగైన డిజిటల్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Read Also: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?