BigTV English
Advertisement

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

ENE2:  టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. కథ ఉన్నా లేకున్నా చివరన మాత్రం సీక్వెల్ అని ప్రకటిస్తున్నారు. అది ఎప్పటికి రిలీజ్ అవుతుంది అనేది ఆ దేవుడికే తెలియాలి. కానీ, ప్రేక్షకులు మాత్రం కొన్ని సినిమాలకు సీక్వెల్స్ కోరుకుంటారు. ఆలాంటి సినిమాలు మాత్రం చాలా రేర్ గా వస్తాయి. ఇక ఎప్పటినుంచో ప్రేక్షకులు కోరుకుంటున్న సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది 2.  విశ్వక్ సేన్, అభినవ్ గోమటం,సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన చిత్రం ఈ నగరానికి ఏమైంది.


నలుగురు స్నేహితులు, వారి మధ్య ఉండే బంధం, వారి కష్టాలు.. కోరికల సమూహారమే ఈ సినిమా. సురేష్ ప్రొడక్షన్స్  బ్యానర్ పై రానా దగ్గుబాటి నిర్మించాడు. 2018 లో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యువతకు ఈ సినిమా బాగా నచ్చింది. ఆ నలుగురు ఫ్రెండ్స్ లో తమను తాము చూసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందా అని ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ ఏడాదిలోనే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ను తరుణ్ భాస్కర్ ప్రకటించాడు. ఈ నగరానికి ఏమైంది రీపీట్ అనే పేరుతో సీక్వెల్ ను ప్రకటించిన తరుణ్ భాస్కర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు.

ఇక ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డితో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  సురేష్ దగ్గుబాటి నిర్మిస్తున్నట్లు పోస్టర్ లో తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి సురేష్ బాబు తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఎక్కువ కావడం వలన తనకు ఈ ప్రాజెక్ట్ సెట్ కాదని, దీని నుంచి తప్పుకోవడమే బెటర్ అనుకోని వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియదు కానీ.. సురేష్ బాబు తప్పుకోవడానికి కారణాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.


అప్పుడంటే హీరోలు కొత్తవారు. రెమ్యూనరేషన్ తక్కువ. కానీ, ఇప్పుడు విశ్వక్ సేన్ స్టార్ హీరోగా మారాడు. తరుణ్ సైతం ఒకపక్క డైరెక్టర్ గా.. ఇంకోపక్క హీరోగా బిజీగా మారాడు. ఇప్పుడు నటీనటులకే ఎక్కువ రెమ్యూనరేషన్ పోతుంది. ఇక సినిమాను గ్రాండ్ గా తీయాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది తట్టుకోలేకనే సురేష్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Related News

Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య

Gatha Vibhavam Trailer: టైమ్ ట్రావెల్ ప్రేమ కథ.. భలే విచిత్రంగా ఉందే

SSMB 29 : మహేష్ సినిమాలో సింహం… ఇంతలా దాచుంచడం వెనుక పెద్ద స్టోరీ ఉందే!

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Roshan Meka: మోహన్ లాల్ సినిమా నుంచి తప్పుకొని శ్రీకాంత్ కొడుకు తప్పు చేశాడా.. ?

Vijay Deverakonda: రష్మిక లక్ విజయ్ కి కలిసొచ్చేలా ఉందే.. అది కూడా జరిగితే తిరుగుండదు..

Sandeep Kishan : సందీప్‌తో విజయ్ కొడుకు కొత్త మూవీ… టైటిల్ పోస్టర్ వచ్చేసింది..

Big Stories

×