Bigg Boss 9 Promo:బిగ్ బాస్ సీజన్ 9.. 9 వారాలు పూర్తయ్యి సక్సెస్ఫుల్ గా 10వ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే 9వ వారంలో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా..సాయి ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం హౌస్ నుండి బయటకు వచ్చేశారు. ఇక సోమవారం వచ్చింది అంటే నామినేషన్స్ రచ్చ ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే. అలా తాజాగా సోమవారం రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బిగ్ బాస్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈసారి నామినేషన్స్ కాస్త సరికొత్తగా తీసుకువచ్చారు. ఈసారి నామినేషన్స్ మొత్తం తలకిందులుగా ఉంటుందని బిగ్ బాస్ ముందే హెచ్చరించారు. అలాగే ఇది చేయడానికి కేవలం ఐదు నిమిషాలు సమయం మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇక మీరు ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటారో ఆ ఒక్కరిని బలమైన మీ కారణాలతో నామినేట్ చేసిన తర్వాత అక్కడే ఉన్న షవర్ కింద నిలబెట్టమని బిగ్ బాస్ చెప్పారు.
బిగ్ బాస్ ఆదేశాల మేరకు నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. నామినేషన్స్ లో మొదట కెప్టెన్ అయినటువంటి ఇమ్మానుయేల్ భరణిని నామినేట్ చేశారు. భరణిని టార్గెట్ చేస్తూ మీరు ఆలోచించి వెనకే ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. హౌస్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక నుండి మీరు కొత్త భరణిని చూస్తారని చెప్పారు. కానీ అది ఎక్కడా కూడా మాకు కనిపించడం లేదు.రీ ఎంట్రీలో మొదట వచ్చినప్పుడు మీలో ఉన్న ఫైర్ మళ్లీ కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. అని ఇమ్మానుయేల్ తన పాయింట్స్ చెప్పారు. ఆ తర్వాత నా కంటే బెటర్ తనూజ అని నాకు అనిపించింది.అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను అని భరణి అనగా..మీరు ఎందుకు స్ట్రాంగ్ కాకూడదు..మీ మీద మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదు. మీరు ఆపోజిట్ పర్సన్(తనూజ) కోసం ఎంత చేసారో మీకు తెలుసు అంటూ ఇమ్మానుయేల్ ఇచ్చి పడేశారు.
ఆ తర్వాత రీతూ దివ్యని నామినేట్ చేస్తూ నువ్వు ఓ ఇద్దరు, ముగ్గురిని నీ దగ్గర పెట్టుకొని వారిని ఓ గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తూ నువ్వు చెప్పిందే వాళ్ళు చేయాలి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఇస్తూ వారిని మిగతా వారి మీదికి బాణాల లాగా వదులుతావు. అంటూ చెప్పింది. ఇక రీతూ మాటలకి దివ్య కోపంతో వారంతా చిన్నపిల్లలా రీతు అంటూ ఫైర్ అయ్యింది. ఎవరికైనా సరే నేను అవుట్ అయ్యాకే సపోర్ట్ చేస్తా.ఏ ఆటలో అయినా సరే చివరి వరకు నేనే ఉండాలని బలంగా కోరుకుంటా అని దివ్య చెప్పడంతోనే రీతు మండి పడుతూ నువ్వు కామెంట్ చేసి వారిని కావాలనే ఆపుతున్నావు. ఇక ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా వాళ్లకి నువ్వు ఆగు,చెయ్,ఒక నిమిషం అంటూ ఆర్డర్ వేస్తున్నావు అంటూ రీతు అనగా.. నేను చెప్పినట్లు వాళ్లు వింటే నీకేంటి ప్రాబ్లం అంటూ దివ్య తిరిగి ప్రశ్నించింది. ఇక లీడర్ టాస్క్ లో నువ్వు నిజంగానే హైపర్ అయ్యావ్. పవన్ బాగా ఆడుతున్నా కూడా నువ్వు నిజంగానే టాస్క్ చెడగొట్టావ్. అంటూ దివ్య రీతుకి చెప్పింది.
ఆ తర్వాత గౌరవ్ సంజనాని నామినేట్ చేస్తూ..మీ దగ్గర గేమ్ లేదు. కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంది. మీ దగ్గర స్వార్థం బాగా ఉంది. అని అంటే..నేను నా గేమ్ చూడడానికి వచ్చా..నువ్వు నీ గేమ్ చూసుకో అంటూ సంజనా ఫైర్ అవుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి నిఖిల్ ని నామినేట్ చేయగా.. లీడర్ బోర్డ్ లో తనూజ, భరణి, దివ్య ముగ్గురు స్ట్రాంగ్.కానీ వాళ్లకంటే పైనే నేను ఉన్నా. నా గేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కచ్చితంగా నేను టాప్ 5 లోకి వస్తా చేసి చూపిస్తా అంటూ నిఖిల్ అనగా.. నేను కూడా అదే చేసి చూపించమంటున్నా అంటూ కళ్యాణ్ నిఖిల్ కి చెప్తాడు. అలా వాడి వేడిగా ఈ వారం నామినేషన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది.ఇక ఈ ప్రోమోలో భరణి,దివ్య, సంజన,నిఖిల్ నామినేట్ అయినట్టు చూపించారు.