Vijay Deverakonda:విజయ్ దేవరకొండ (Vikram k Kumar).. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా అవతరించారు విజయ్ దేవరకొండ.. ‘ అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటివరకు ఈ సినిమాకు ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో సందేహం లేదు. అంతలా యువతలో ఒక సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా రేంజ్ లో సక్సెస్ విజయ్ దేవరకొండకు ఇప్పటికీ లభించలేదు అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా మరోవైపు విజయ్ దేవరకొండ కెరియర్లో పెద్దగా సక్సెస్ చూడకపోయినా.. ఇటు వ్యక్తిగతంగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న (Rashmika Mandanna)తో ప్రేమలో పడిన విజయ్ దేవరకొండ.. అప్పట్నుంచి ఆమెతో చట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కానీ ఎక్కడ బయటపడలేదు. దీనికి తోడు ఇటీవల నిశ్చితార్థం రహస్యంగా చేసుకున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. పైగా వచ్చే యేడాది ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. విజయ్ దేవరకొండ ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నా.. రష్మిక మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పి తమ బంధాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ జంట పెళ్లి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే.. రష్మిక అదృష్టం విజయ్ దేవరకొండకు పట్టేలా కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే..విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తన తదుపరి చిత్రాన్ని యు వి క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నట్లు సమాచారం. ఇది స్పోర్ట్స్ డ్రామాగా వస్తోందని దీనికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట ఈ సినిమాను నితిన్ తో చేయాలనుకున్నారట. కానీ ఇప్పుడు విజయ్ తో పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిపోతున్నారు.
ALSO READ:Imanvi : ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్.. ఆ హీరోయిన్స్ జాబితాలో ఇమాన్వి!
మొత్తానికైతే రష్మిక అదృష్టం విజయ్ కి దక్కబోతోంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ విజయ్ గనుక ఆ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు అంటే.. ఇక ఆయనకు తిరుగు ఉండదు అనడంలో సందేహం లేదు. ఏదేమైనా రష్మిక తో నిశ్చితార్థం జరిగిన వెంటనే ఇప్పుడు ఈయనకు వరుసగా స్టార్ డైరెక్టర్లతో అవకాశాలు వస్తున్నాయి. ఒకవేళ వివాహం తర్వాత ఈ సినిమాలన్నీ గనుక హిట్ అయితే మాత్రం రష్మిక అదృష్టమే విజయ్ కి వరించింది అని చెప్పడంలో సందేహం లేదు.