Pune Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ప్రేయసి కోసం భార్యని చంపేసి, ఇనుప డబ్బాలో వేసి తగలబెట్టాడు. ఆ తర్వాత భార్య ఫోన్ నుంచి ఐ లవ్ యూ అంటూ మరో వ్యక్తికి మేసేజ్ పెట్టాడు. భర్త ఓవర్ యాక్టింగ్ కారణంగా పోలీసులకు బుక్కైపోయాడు. సంచలనం రేపిన ఈ ఘటన పూణెలో వెలుగుచూసింది.
ప్రియురాలి కోసం ఏం చేశాడంటే..
పుణెకు చెందిన సమీర్ జాదవ్-అంజలిలకు 2017లో వివాహం జరిగింది. పుణెలోని శివానే ఏరియాలోని స్వామి సంకుల్ అపార్ట్‌మెంట్‌లో ఈ జంట ఉంటోంది. ఆటోమొబైల్‌లో డిప్లొమా చేసిన సమీర్, ఓ గ్యారేజ్ నిర్వహిస్తుండగా, అంజలి మాత్రం ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చూసి మురిసిపోయేవారు.
అక్టోబర్ 26న సమీర్-అంజలిలు ఖేడ్ శివపూర్ సమీపంలోని మరియాయ్ ఘాట్‌కు కారులో వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అంజలిని షిండేవాడిలోని అద్దెకు తీసుకున్న గోడౌన్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేస్తుండగా ఆమెని గొంతు కోసి చంపాడు. భార్య శవాన్ని ఇనుప డబ్బాలో వేసి కాల్చి బూడిద చేశాడు. అందుకు ముందు అందుకు సంబంధించిన సామాగ్రిని సిద్ధం చేశాడు. ఆ తర్వాత బూడిదను నదిలో పాడేశాడు.
భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి తగలబెట్టాడు
ఒక విధంగా చెప్పాలంటే ‘దృశ్యం’ సినిమా అన్నమాట. ఇంతవరకు బాగానే జరిగింది. కేసు తప్పుదోవ పట్టించేందుకు తన బుర్రకు పదునుపెట్టాడు. తన భార్యకి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని నమ్మించేలా ప్లాన్ చేశాడు. అంజలి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తితో కొద్దిసేపు చాట్ చేసినట్టు వ్యవహరించాడు. చివరకు చంపిన రెండు రోజుల తర్వాత తన భార్య కనిపించలేదని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కేసు నిమిత్తం తరచుగా స్టేషన్‌కు వెళ్లి బాధపడుతున్నట్లు కలరింగ్ ఇచ్చాడు, తనలోని నటనను బయటపెట్టాడు. చివరకు పోలీసులకు అనుమానం రావడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టయిల్ లో విచారణ చేపడడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడు భార్య హత్య గురించి కీలక విషయాలు బయటపెట్టాడు.
ALSO READ: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్, ఆ తర్వాత ఏం జరిగిందంటే
అంజలికి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందని భావించారు పోలీసులు. ఈ కారణాల వల్ల సమీర్ చంపేసి ఉంటాడని అనుకున్నారు. కానీ అసలు విషయం బయటపడింది. సమీర్ వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడని చివరికి తేలింది. ఆమె కారణంగా చంపాశాడని తేలింది. ఈ ప్లాన్ కోసం.. అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘దృశ్యం’ మూవీని నాలుగు సార్లు చూసి హత్యకు ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడు నిందితుడు సమీర్.