Amala paul: సౌత్ ప్రేక్షకులకు బాగా పరిచయమైన హీరోయిన్ అమలాపాల్.

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దమున్నర గడిచింది. మ్యారేజ్ అయినా గ్లామర్ ఇండస్ట్రీని దూరం పెట్టలేదు.

వచ్చిన ఆఫర్లను అంది పుచ్చుకుంటోంది. మలయాళం మూవీ ద్వారా చిత్ర పరిశ్రమకు వచ్చిన ఆమె వెనుదిరిగి చూడలేదు.

ఆ తర్వాత కోలీవుడ్, చివరకు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల అందరి సరసన నటించింది.. అభిమానులను సంపాదించుకుంది.

ఈ ఏడాది మాలీవుడ్ సినిమాలతో సరిపెట్టుకుంది. సరైన ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది.

అలాగని అభిమానులకు దూరంగా లేదు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది.

ప్రస్తుతం తన భర్తతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేద్దాం.
