The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా 2026 జనవరి 9 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తరచూ వాయిదా వేయటమే కాకుండా సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కూడా రాకపోవడంతో చిత్ర బృందంపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా జనవరి 9 నుంచి కూడా వాయిదా పడనుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇంకా విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభం కానీ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం ఈ వార్తలను ఖండిస్తూ జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుందని తెలిపారు. ఇక ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారని అభిమానులు భావించారు కానీ ఆరోజు కూడా అభిమానులకు నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతుందని వెల్లడించారు. తప్ప సరైన తేదీ కూడా ప్రకటించకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ (S.S.Thaman) ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తమన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రాజా సాబ్ సినిమా నుంచి ఒక వారం వ్యవధిలోగా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఉండబోతుందని తెలిపారు. అలాగే మూడు పాటలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయని వెల్లడించారు. అభిమానులు ఎవరు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా నెగిటివ్ ట్రెండ్స్ లో జాయిన్ అవ్వద్దని కోరారు.ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు వినోదాన్ని అందిస్తుందని తమన్ ధీమా వ్యక్తం చేశారు.
యూఎస్ఏలో ప్రీ రిలీజ్ ఈవెంట్…
ఇక ఈ సినిమా జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయని ఈ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా గ్లోబల్ రేంజ్ లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని యుఎస్ఏ లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జనవరి ఒకటవ తేదీకి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సందడి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Also Read: Nagachaitanya -Sobhita: శోభితపై ప్రశంసలు కురిపించిన చైతూ… ఆ టాలెంట్ ఎక్కువ అంటూ!