BigTV English
Advertisement

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

మన దేశంలో రోడ్లపై అనేక రంగుల నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు కనిపిస్తాయి. సాధారణంగా తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల నంబర్ ప్లేట్లను మనం తరచూ చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు నీలం రంగు నంబర్ ప్లేట్ ఉన్న వాహనం కనిపిస్తే దాని ప్రత్యేకత ఏమిటో చాలా మందికి తెలియదు. అసలు ఈ బ్లూ నంబర్ ప్లేట్ ఏ వాహనాలకు ఇస్తారో తెలుసుకుందాం.


యజమాని హోదాను బట్టి
భారతదేశంలో వాహనాల నంబర్ ప్లేట్లు వాటి వినియోగం, యజమాని హోదా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ వాహనం అనే ఆధారంగా నెంబర్ ప్లేటు రంగును నిర్ణయిస్తారు. వీటిలో నీలం రంగు ప్లేట్ అత్యంత ప్రత్యేకమైనది. ఈ ప్లేట్ సాధారణ పౌరులకు ఇవ్వరు. ఇది విదేశీ రాయబార కార్యాలయాలు, కౌన్సిలేట్ ఆఫీసులు, యునైటెడ్ నేషన్స్ టి అంతర్జాతీయ సంస్థల వాహనాలకు మాత్రమే జారీ చేస్తారు.

దేశ రాయబారులకు చెందినవి
ఈ బ్లూ నంబర్ ప్లేట్‌పై తెల్ల రంగు అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి. సాధారణ రాష్ట్ర కోడ్‌లు వీటిపై ఉండవు. వాటికి బదులుగా దేశానికి సంబంధించిన డిప్లమాటిక్ కోడ్ ఉంటాయి. ఈ అక్షరాలు వాహనం ఏ దేశ రాయబార కార్యాలయానికి చెందినదో సూచిస్తాయి. ఉదాహరణకు, అమెరికా రాయబార కార్యాలయానికి చెందిన వాహనంపై ప్రత్యేకంగా కేటాయించిన కోడ్ ఉంటుంది.


ఈ వాహనాలకు కొన్ని ప్రత్యేక రాయితీలు కూడా ఉంటాయి. వీటిని సాధారణంగా భారత ప్రభుత్వం, రవాణా శాఖ ప్రత్యేక ప్రాధాన్యతతో రిజిస్టర్ చేస్తుంది. ఈ వాహనాలు విదేశీ రాయబారుల రక్షణలో భాగంగా కొన్ని డిప్లోమేటిక్ మినహాయింపులు పొందుతాయి. ఉదాహరణకు, ఈ వాహనాలకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై సాధారణ చట్టాలు వర్తించకపోవచ్చు. అయితే తీవ్రమైన నేరాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాయబార కార్యాలయాన్ని సమాచారం అడుగుతుంది.

భారతదేశంలో ప్రస్తుతం తెల్ల నంబర్ ప్లేట్ అనేది ప్రైవేట్ వాహనాలకు, పసుపు నంబర్ ప్లేట్ కమర్షియల్ వాహనాలకు, నలుపు నంబర్ ప్లేట్ పర్యాటక లేదా అద్దె వాహనాలకు, ఆకుపచ్చ నంబర్ ప్లేట్ విద్యుత్ వాహనాలకు (EVs) ఇస్తున్నారు. వీటిలో బ్లూ నంబర్ ప్లేట్ అత్యంత అరుదుగా కనిపించే వాహనాలదే.

అంతేకాకుండా, ఈ వాహనాలను సాధారణ ప్రజలు గౌరవించాలి. ఎందుకంటే ఇవి మన దేశంలో ఇతర దేశాలకు చెందిన ప్రతినిధుల వాహనాలు. వీటిపై దాడి చేయడం లేదా అవమానకరంగా ప్రవర్తించడం ఎంతో నేరం. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలాంటివి తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

మొత్తంగా చెప్పాలంటే, బ్లూ నంబర్ ప్లేట్ భారతదేశంలో విదేశీ రాయబార వాహనాలకు మాత్రమే ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. ఇది దేశాల మధ్య స్నేహపూర్వక రాజనీతిక సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. రహదారులపై అటువంటి వాహనాలు కనిపిస్తే, అవి ప్రత్యేక అతిథులవాహనాలు అని గుర్తుంచుకోవాలి.

Related News

Jamun Seed Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Coffee Face Mask: కాఫీ ఫేస్ మాస్క్‌తో.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Vertigo Problem: రోజూ నిద్రలేవగానే తల గిర్రుమంటోందా.. వర్టిగో గురించి తెలియాల్సిన సమయమిదే!

 Ajwain Seed Water: వాము నీరు తాగితే.. నమ్మలేనన్ని లాభాలు !

Big Stories

×