BigTV English

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Brahmanandam: స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బ్రహ్మీ.. అసలు నిజం ఏంటంటే..?

Brahmanandam.. తెలుగు సినీ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఏమిటంటే బ్రహ్మానందం(Brahmanandam) లాంటి గొప్ప కమెడియన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడమే. ఆయనను చూడగానే మన మోములో నవ్వు వస్తుంది. ఒక కంటితో నవ్వించి ఇంకో కంటితో ఏడిపించగల సత్తా ఆయన సొంతం. అంతేకాదు తన కామెడీతోనే సినిమాను హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండే బ్రహ్మానందం ఒక స్టార్ హీరో పై ఫైర్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం..

సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.ఆయన హాస్య భరితమైన హావ భావాలు తెలుగు ప్రేక్షకుల రోజూవారీ కార్యక్రమాలలో ఒక భాగం అయిపోయాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మీమ్స్ రూపంలో బ్రహ్మానందం ప్రతిరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉంటారు బ్రహ్మానందం. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi),మోహన్ బాబు(Mohan Babu), బాలకృష్ణ (Balakrishna), నాగార్జున(Nagarjuna ), వెంకటేష్ (Venkatesh) ఇలా అందరి కుటుంబాలతో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. హీరోలు కూడా బ్రహ్మానందం తమ సొంత ఫ్యామిలీ మెంబర్ గానే భావిస్తారు.


మోహన్ బాబుకు క్లాస్ పీకిన బ్రహ్మానందం..

అయితే ఇదిలా ఉండగా మోహన్ బాబు(Mohan Babu) ఫ్యామిలీతో బ్రహ్మానందం కి ఒక ఊహించని ఘటన జరిగిందని సమాచారం. అంతేకాదు ఒక విషయంలో మోహన్ బాబుకి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.. ఈ విషయాన్ని మంచు మనోజ్ (Manchu Manoj) స్వయంగా బయటపెట్టారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంచు విష్ణు ఆయన భార్య విరోనికా రెడ్డి పెళ్లి చాలా డ్రమాటిక్ గా జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరి ప్రేమ వ్యవహారం సినిమా స్టైల్ లో సాగిందని తెలుస్తోంది. మంచు విష్ణు ఈ విషయంపై స్పందిస్తూ.. విరోనికాతో పరిచయం తర్వాత.. నేను ఆమెతో నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేశాను. దానికి తను కూడా ఓకే చెప్పింది. అయితే ఒక్క మాట మాత్రం నేను విరోనికా తో క్లారిటీగా చెప్పాను. మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఆయన్ని బాధపెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. కానీ నిన్ను ప్రేమించినట్లు ఇంకెవరిని కూడా నేను ప్రేమించలేను అంటూ అని చెప్పాను. దానికి తాను కూడా సరే అన్నది.. అయితే ఒకసారి మా ప్రేమ విషయం ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది. అది కాస్త నాన్నకు తెలిసింది. మా అక్క, బావకి కూడా మా ప్రేమ విషయం తెలుసు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి బ్రహ్మానందం అంకుల్ వచ్చారు. నీ గురించి విరోనికా గురించి నాన్నతో మాట్లాడుతున్నారు అని అనగా నేను ఒక్కసారిగా భయపడిపోయాను. సుమారుగా 30 నిమిషాల పాటు.. అటు బ్రహ్మానందం అంకుల్ ,నాన్న క్లాస్ పీకారు. నువ్వు కొట్టిన పర్వాలేదు కానీ నేను చెప్పాలనుకున్నది చెప్తాను అని చెప్పి ఆ సమయంలో మా ఇద్దరి పెళ్లి చేయాలని నాన్న కి ఒక రకమైన వార్నింగ్ లాగా కూడా ఇచ్చారు. ఆ తర్వాత నాన్న మాతో మాట్లాడి మా ఇద్దరికీ పెళ్లి జరిపించారు అంటూ మంచు విష్ణు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే బ్రహ్మానందం వల్లే తాను పెళ్లి చేసుకున్నానని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇకపోతే వీరికి నలుగురు పిల్లలు సంతానం అన్న విషయం అందరికీ తెలిసిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×