TGPSC Group 3: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నవంబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 10 నుంచి 26 వరకు సర్టిఫికెట్ల ధ్రువీకరణ నిర్వహించనున్నారు. గ్రూప్-3 మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరవ్వాలని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. హాల్ టికెట్ల వారీగా పూర్తి వివరాలకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను ఉంచారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు జిరాక్స్ సెట్లు తమతోపాటు తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి ప్రియాంక తెలిపారు.
టీజీపీఎస్సీ 1388 గ్రూప్ 3 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. 2024 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.67 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్చి 14న విడుదల . 2024 నవంబరు 17, 18ల్లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 2.67 లక్షల మంది హాజరయ్యారు. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా విడుదలైంది. అభ్యర్థులు రేపట్నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని టీజీపీఎస్సీ సూచించింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు స్వీయ ధ్రువీకరణతో సమర్పించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి వైకల్య శాతాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పీలేట్ మెడికల్ బోర్డుకు పంపిస్తారు. అప్పీలేట్ మెడికల్ బోర్డు నివేదికను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
1. దరఖాస్తు ఫామ్ (2 కాపీలు)
2. హాల్ టికెట్.
3. ఆధార్ కార్డ్ లేదా ఓటరు ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డ్ / బ్యాంక్ ఖాతా / పాస్ పోర్ట్ వంటి ఏదైనా ప్రభుత్వ ఐడీ
4. విద్యార్హతల రుజువు
5. S.S.C / CBSE / ICSE సర్టిఫికెట్లు
6. 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
7. నివాస ధృవీకరణ పత్రం (అభ్యర్థి 1 నుండి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకపోతే).
8. నిరుద్యోగుల ప్రకటన (పరీక్ష ఫీజు మినహాయింపు కోసం).
9. ప్రస్తుత ఉద్యోగ యజమాని నుంచి నిరభ్యంతర పత్రం
10. సర్వీస్ సర్టిఫికేట్ (వయస్సు సడలింపు కోసం).
11. క్రీడా రిజర్వేషన్ క్లెయిమ్ సర్టిఫికేట్
12. రిజర్వేషన్, వయస్సు సడలింపు కోసం మాజీ సైనికుల సర్టిఫికేట్లు
13. బీసీ,ఎస్సీ, ఎస్టీలు కమ్యూనిటీ సర్టిఫికేట్ (తండ్రి/తల్లి పేరుతో అభ్యర్థికి జారీ చేసినవి)
14. బీసీల నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్
15. దరఖాస్తు చేసిన సంవత్సరానికి EWS సర్టిఫికేట్
16. పీహెచ్ అభ్యర్థులు SADAREM ఫార్మాట్ సర్టిఫికెట్
17. ధ్రువీకరణ ఫామ్‌లు (2 సెట్లు).
18. ఏవైనా ఇతర సర్టిఫికెట్లు అవసరం.
తదుపరి ధృవీకరణలో, దరఖాస్తు ఫారమ్ / చెక్ లిస్ట్ / సర్టిఫికెట్లలో అందించిన వివరాలు బట్టి అభ్యర్థి అర్హులు కాదని తేలితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపిక ప్రక్రియను రద్దు చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్ కు హాజరు కాలేని అభ్యర్థులు రిజర్వ్ డే 27/11/2025 నుంచి 29/11/2025 మధ్య హాజరుకావొచ్చు.