Medak District: మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో దారుణ ఘటన జరిగింది. భర్తపై కోపంతో రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసింది ఓ తల్లి. మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టింది. భర్త స్వామి వారం రోజులుగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌పై చెత్త సేకరణ పనికి వెళ్తున్నాడు. నిన్న పని చేసిన డబ్బులు ఇవ్వాలని భర్తతో గొడవ పెట్టుకుంది భార్య సంధ్య. అధికారులు ఇంకా జీతం ఇవ్వలేదని చెప్పడంతో ఆగ్రహంతో చిన్నారిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసింది సంధ్య. టైర్ల కింద చిన్నారి ఉన్నట్లు గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ తల్లి తన రెండు నెలల కుమార్తెను చెత్త సేకరణ ట్రాక్టర్ టైర్ల కింద పడుకోబెట్టి దారుణానికి ఒడిగట్టింది. వెంటనే అక్కడి స్థానికులు గమనించి ఆ చిన్నారికి కాపాడారు.
అయితే స్వామి, సంధ్యలు దంపతులకి ఇద్దరు కుమారులు, రెండు నెలల ముందు పుట్టిన కుమార్తె ఉన్నారు. ఇద్దరూ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్వామి గ్రామ పంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ పై పని చేస్తూ, వారానికి రోజుల తరబడి పనికి వెళ్తున్నాడు. అయితే ముందుగా సంధ్య పనికి వెళ్ళిన జీతం ఇవ్వమని గొడవ చేసింది. కానీ, ఇంకా జీతం ఇవ్వలేదు అధికారులు అని స్వామి చెప్పాడు.. దీంతో మద్యం మత్తులో ఉన్న సంధ్య, పసి కళ్ళతో ఏడుస్తున్న తన కుమార్తెను కూడా పట్టించుకోకుండా, ట్రాక్టర్ టైర్ల కింద పడుకోబెట్టింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంధ్యను బెదిరించి, ట్రాక్టర్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ వాహనాన్ని ఆపి, చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో కుమార్తెకు ఎలాంటి గాయాలు జరగలేదు.
Also Read: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..
ఘటన స్థలానికి చేరుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, బాలల సంరక్షణ అధికారులు విచారణ చేశారు. స్థానికులు సంధ్య తన పిల్లలపై తీవ్రంగా హింసిస్తుంటుందని, ఇది మొదటి సంఘటన కాదని ఆరోపించారు. ఈ ఆరోపణల మేరకు అధికారులు సంధ్యకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలను మెదక్‌లోని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి మార్చారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.. సంధ్యపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు.