Cricket players : సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే దానికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం. మా వాళ్లే గెలవాలని, గెలుస్తారని పూజలు కూడా చేస్తుంటాం. ఇక మనలో చాలా మంది క్రికెట్ అయిపోయేంత వరకు టీవీ ముందును నుంచి అస్సలు పక్కకు కూడా జరగరు. ఇదంతా పక్కన పెడితే.. క్రికెట్ల ముఖానికి ఉన్న వైట్ క్రీం ను మీరెప్పుడైనా గమనించారా? అదెందుకు వేసుకుంటారు? దానివల్ల ఏం ఉపయోగం? అన్న అనుమానాలు వచ్చాయా? చాలా మందికి వైట్ క్రీం గురించి డౌట్ వచ్చినా.. దాని గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. గతంలో క్రికెటర్లు వైట్ క్రీమ్ ముఖానికి రాసుకున్నారు. కానీ ప్రస్తుతం క్రికెటర్లు వైట్ క్రీమ్ ను వాడటం లేదు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్ సిక్సెస్ 2025 విజేతగా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మనీ ఎంతంటే
వైట్ క్రీమ్ ను ముఖానికి ఎందుకు రాయడం లేదు. పాత ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్ లో ఈ వైట్ క్రీమ్ ను ముఖానికి రాసుకొని వాడేవారు. వాస్తవానికి ఈ క్రీమ్ పేరు జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్. ఇది ప్రధానంగా సూర్య కిరణాలను రిఫ్లెక్ట్ చేసే పని చేసింది. దీని వల్ల ప్లేయర్లు ఎండలో ఎక్కువ సేపు ఆడినా చర్మానికి ఎఫెక్ట్ అయ్యేది కాదు. కానీ కొద్ది రోజులుగా ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం మానేశారు. దానికి ఓ కారణం ఉందండోయ్. దీని వెనుక ఉన్న పెద్ద కారణం బాల్ టాంపరింగ్ అనే చెప్పవచ్చు. చాలా మంది బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో ముఖం పై ఉన్న ఈ సన్ స్క్రీన్ ను బంతికి రాసేవారు. దీంతో బాల్ చాలా ఎక్కువగా స్వింగ్ అయితుండేది. ఈ విషయం ఐసీసీ అధికారులకు తెలిసి దీనిపై బ్యాన్ విధించారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
క్రికెటర్లు తమ ముఖానికి అప్లై చేసే వైట్ క్రీం జింక్ ఆక్సైడ్ తో తయారైన స్పెషల్ సన్ స్క్రీన్. ఇది సూర్యుని హానికరమైన యూవీఏ, యూవీబీ కిరణాల నుంచి ఆటగాళ్లను రక్షిస్తుంది. ఎందుకంటే క్రికెటర్లు గంటల తరబడి సూర్యరశ్మిలోనే ఉంటారు. దీనివల్ల వారి చర్మం దెబ్బతింటుంది. చర్మం దెబ్బతినకూడదనే ఆటగాళ్లు ఈ క్రీమ్ ను సున్నితమైన భాగాలకు ఉపయోగిస్తారు. జింక్ ఆక్సైడ్ తో తయారు చేసిన ఫిజికల్ సన్స్క్రీన్ చర్మ రక్షణ కోసం క్రికెటర్లు ఉపయోగించేదే వైట్ క్రీమ్. క్రికెటర్లు ఉపయోగించే శారీరక సన్ స్క్రీన్ లో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది తెల్లని పొడి ఖనిజం. ఇది హానికరమైన సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే దీన్ని ఎన్నోఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. క్రికెటర్లు తమ ముఖానికి వైట్ క్రీం.. అదే సన్ స్క్రీన్ ను వేసుకోవడం ఫ్యాషనో, స్టైలో కాదండోయ్. ఇలాంటి వైట్ క్రీమ్ అప్లికేషన్ ముఖ్య ఉద్దేశ్యం సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించడమే. సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మ కణాలలోని డీఎన్ఎను దెబ్బతీస్తాయి. ఇలా కాకూడదనే క్రికెటర్లు ఈ వైట్ క్రీం ను పెట్టుకుంటారు.
Also Read : IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?
?igsh=MXA2ZTI2dzV1Yjlrbg==