Mamatha Mohan Das (Image Source: Instagram)
అందాల భామ మమతా మోహన్ దాస్,. హీరోయిన్ గా, సింగర్ గా తెలుగువారికి పరిచయమైన ఆమె 2009 లో ఒక అరుదైన క్యాన్సర్ బారినపడి కోలుకుంది.
ChhaviMittal (Image Source: Instagram)
ఛావి మిట్టల్.. బాలీవుడ్ బుల్లితెర నటి. 2022 లో రొమ్ము క్యాన్సర్ తో పోరాటం చేసి గెలిచింది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉంది.
Mahima Chowdary (Image Source: Instagram)
మహిమా చౌదరి.. బాలీవుడ్ లో మంచి సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె 2022 లో రామ్మో క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.
Rakesh Roshan (Image Source: Instagram)
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ సైతం క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాడు.
Manisha Koirala (Image Source: Instagram)
బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా.. ఒకే ఒక్కడు, బొంబాయి సినిమాలతో తెలుగువారికి సుపరిచితం అయిన ఆమె 2012 లో అండాశయ క్యాన్సర్ కు గురై కోలుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Sanjay Dutt (Image Source: Instagram)
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సైతం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడినవాడే. ఎంతో కష్టతరమైన చికిత్స పొంది కోలుకున్నాడు.
Hamsa Nandini (Image Source: Instagram)
హంస నందిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుమానాస్పదం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ క్యాన్సర్ బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
Sonali Bendre (Image Source: Instagram)
అందాల నటి సోనాలీ బింద్రే సైతం క్యాన్సర్ తో పోరాటం చేసింది. 2018 లో మెటాస్టాటిక్ క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
Hina Khan (Image Source: Instagram)
బాలీవుడ్ నటి హీనా ఖాన్.. గతేడాది తాను క్యాన్సర్ బారిన పడినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. ఆమె త్వరగా కోలుకొని రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.