Indian Immigrants: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 13న అమెరికా పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే అంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే యూఎస్ లో అక్రమంగా వలస వచ్చి జీవనం సాగిస్తున్న వారిని, స్వదేశాలకు పంపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కన్ను భారతీయులపై కూడా పడింది.
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, అక్రమ వలసదారులను దేశంలో ఉండనివ్వను అంటూ తెగేసి చెప్పారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన వారిని.. చేతులకు బేడీలు వేసి మరీ ఆయా దేశాలకు తరలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇలాంటి చర్యలను కొందరు విభేదించారు. తాజాగా ట్రంప్ కన్ను ఇండియన్స్ పై కూడ పడింది.
మన దేశానికి చెందిన ఎందరో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడినవారు కూడ ఉన్నారు. మరికొందరు చదువు కోసం, ఉపాధి కోసం కూడ అమెరికాలో ఉంటున్న పరిస్థితి. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో యుఎస్ లో స్థిరపడ్డ భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా లెక్క ప్రకారం యుఎస్ లో సుమారు 18 వేల మంది భారతీయులు అక్రమంగా వలస వచ్చినట్లు గుర్తించారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు తరలిస్తామని అమెరికా అంటోంది.
కాగా 205 మంది భారతీయులను మిలిటరీ విమానంలో ఇండియాకు తరలించినట్లు తాజా సమాచారం. ఆ విమానం పంజాబ్ కు రానున్నట్లు, అందులో ఎంతమంది భారతీయులు ఉన్నారన్నది పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే.. మొత్తం 8 లక్షల మంది భారతీయులు యుఎస్ లో అక్రమంగా ఉన్నారన్న వార్తలతో అక్కడి భారతీయుల్లో భయాందోళన వ్యక్తమవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మెక్సికో, ఎల్ సాల్వే డార్ తర్వాత ఇండియా వలసదారుల సంఖ్య మూడో స్థానంలో ఉన్నారట. ఎన్నో ఆశలతో యుఎస్ కు వెళ్లిన భారతీయులు నేడు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారని సమాచారం.
Also Read: PM Modi: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. లోక్ సభలో మోడీ కీలక ప్రకటన.. ఇకపై..
ట్రంప్ తీరు ఇలాగే ఉంటే, మున్ముందు యుఎస్ లో ఇండియన్స్ మనుగడ అసాధ్యమేనని భావించవచ్చు. అలాగే ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత ట్రంప్ నిర్ణయంలో ఏమైనా మార్పు వస్తుందన్న భావన కూడ కొందరిలో కనిపిస్తోంది. మొత్తం మీద మోడీ ఈ విషయంలో చొరవ చూపాలని, అప్పుడే యుఎస్ లోని భారతీయులకు ఊరట లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.