T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి మాసంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. ఇండియాతో పాటు శ్రీలంక రెండు దేశాలు కూడా ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు పాల్గొనబోతున్న ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేదికలు తాజాగా ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ, ముంబై, కోల్ కతా, అహ్మదాబాద్ చెన్నైలో టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడనుంది కాబట్టి, వాళ్లకు సంబంధించిన ఏ మ్యాచ్ జరిగినా శ్రీలంక వేదిక కానుంది. శ్రీలంకలోని కొలంబో, క్యాండీలో మ్యాచ్ లు నిర్వహించే ఛాన్స్ ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఐసీసీ ఈవెంట్లు ఇండియా లేదా పాకిస్తాన్ లో జరిగితే…. తటస్థ వేదికలను ప్రతిసారి సిద్ధం చేస్తున్నారు.
అలాగే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా మ్యాచ్ జరిగితే కూడా తటస్థ వేదికను ఉపయోగించుకుంటున్నారు. ఛాంపియన్ టోపీ పాకిస్తాన్ లో జరిగితే, ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ దుబాయిలో నిర్వహించారు. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాతో పాటు శ్రీలంకలో జరుగుతోంది. ఈ లెక్క ప్రకారం పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. అయితే టోర్నీ ఆవిష్కరణ మాత్రం ఇండియాలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ ఈవెంట్ కు పాకిస్తాన్ గైర్హాజరు అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఖరారు కాగా.. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్ కు చేరితే వేదిక మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు శ్రీలంకలోని కొలంబో వేదిక కానుంది.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ జట్ల మధ్య మొత్తం 55 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఇక ఈ 20 జట్లను 4 గ్రూప్ లుగా విభజిస్తారు. ఇలా జరిగితే, మరోసారి టీమిండియా, పాకిస్తాన్ మళ్లీ ఒకే గ్రూప్ లో ఉండే ఛాన్సులు ఉంటాయి. గ్రూప్ స్టేజ్ లో రాణించిన జట్లు సూపర్ 8కు చేరతాయి. ఆ తర్వాత సెమీస్, అనంతరం ఫైనల్స్ ఉంటాయి.
🚨 NARENDRA MODI STADIUM LIKELY TO HOST THE T20I WORLD CUP FINAL 🚨
– The Shortlisted venues are Ahmedabad, Delhi, Kolkata, Chennai & Mumbai in India. [Devendra Pandey From Express Sports]
Each venue is likely to get 6 matches each. pic.twitter.com/jg1tSI8VXS
— Johns. (@CricCrazyJohns) November 6, 2025