BigTV English

Akkineni Nagarjuna: నాగార్జున ఇంట్లో చిరు, వెంకీ.. ఫోటో వైరల్

Akkineni Nagarjuna: నాగార్జున ఇంట్లో చిరు, వెంకీ.. ఫోటో వైరల్

Akkineni Nagarjuna: సాధారణంగా ఒక హీరో.. ఇంకో హీరోను కలిస్తేనే పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇద్దరి హీరోల అభిమానులకు ఆ రోజు పండగే. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. అలాంటింది.. టాలీవుడ్  ఫిల్లర్స్ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఫ్యాన్స్ కు అన్ని పండగలు ఒకేసారి వచ్చేస్తాయి. తాజాగా అలాంటి ఫ్రేమ్ నే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


టాలీవుడ్ 4 ఫిల్లర్స్ అంటే.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఒకప్పుడు అంటే వీరు నలుగురు కలిసినా అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు. హీరోలు.. స్టార్స్ అయ్యారు.. ఫ్యాన్స్ పెరిగారు. గొడవలు.. వివాదాలు.. ఇలా చాలావరకు హీరోలు ఒకచోట కనిపించడమే మానేశారు. దీంతో ఎప్పుడో ఒకసారి వీరు కలిస్తే అది ఫ్యాన్స్ కు పండగనే.

ఇక ఇప్పుడు 4 ఫిల్లర్స్ లో ముగ్గురు ఫిల్లర్స్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో కలిసి అభిమానులకు కనువిందు చేశారు. ఇక వీరి కలయికకు వేదికగా మారింది నాగ్  ఇల్లు. గతేడాది  నాగ్ పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య, శోభితా వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ పెళ్ళికి చాలా కొద్దిమంది ప్రముఖులే హాజరయ్యారు. అందులో చిరంజీవి ఒకరు. పెళ్ళికి ముందో.. పెళ్లి తరువాతనో.. చిరు.. అక్కినేని ఇంట్లో ఇలా సేదతీరాడు.


నాగ్, వెంకీ ఒకే లాంటి డ్రెస్ లలో కనిపించగా..  చిరు వైట్ కలర్ టీ షర్ట్ లో అందంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ  ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అబ్బా..  ఏమున్నారా.. మన హీరోలు. ఈ ఫ్రేమ్ లో బాలయ్య కూడా ఉండి ఉంటేనే.. నా సామిరంగా నెక్స్ట్ లెవెల్ ఉండేది ఫ్రేమ్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక వీరి కెరీర్ ల గురించి చెప్పుకుంటే .. ప్రస్తుతం ముగ్గురు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Sravanthi Chokarapu : చీరలో క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న యాంకరమ్మ…

వెంకటేష్.. ఈ మధ్యనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వెంకీ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలవడమే కాకుండా మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరేలా చేసింది. ఇక ఈ సినిమా తరువాత జోష్ పెంచిన వెంకీ మామ.. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. సినిమాలతో పాటు రానా నాయుడు 2 వెబ్ సిరీస్ తో మరికొన్ని రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నాడు.

ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. బింబిసారతో హిట్ అందుకున్న వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అక్కినేని నాగార్జున.. చిరు, వెంకీ, బాలయ్య పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే.. నాగ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా మూవీని కూడా రిలీజ్ చేయలేదు. అయితే మిగతా హీరోలులా కాకుండా ఈసారి నాగ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో అదరగొట్టడానికి రెడీ అయ్యాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో, రజినీకాంత్ హీరోగా నటిస్తున్న  కూలీ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×